India Tour of Zimbabwe : జింబాబ్వే విమానం ఎక్కిన యువ భార‌త్‌..

జింబాబ్వే ప‌ర్య‌ట‌న కోసం భార‌త యువ జ‌ట్టు బ‌య‌లుదేరింది.

IND vs ZIM : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 గెలిచిన జోష్‌లో టీమ్ఇండియా ఉంది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అంతా తుఫాను కార‌ణంగా ఇంకా వెస్టిండీస్‌లోని బార్బ‌డోస్‌లోనే ఉన్నారు. మ‌రోవైపు జింబాబ్వే ప‌ర్య‌ట‌న కోసం భార‌త యువ జ‌ట్టు బ‌య‌లుదేరింది. గిల్ సార‌థ్యంలోని భార‌త బృందం తాత్కాలిక కోచ్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ ల‌తో పాటు స‌పోర్టింగ్ స్టాఫ్ మొత్తం జింబాబ్వే విమానం ఎక్కింది.

జింబాబ్వేతో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, జ‌స్‌ప్రీత్ బుమ్రా వంటి ఆట‌గాళ్లు విశ్రాంతి ఇచ్చారు. ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన ఆట‌గాళ్ల‌తో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం రాని ఆట‌గాళ్ల‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో ఉన్న వారిలో ముగ్గురు మాత్ర‌మే జింబాబ్వే సిరీస్‌లో ఆడ‌నున్నారు.

Rohit Sharma Mother : రోహిత్ శ‌ర్మ త‌ల్లి పోస్ట్ వైర‌ల్.. ‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో నా ఇద్ద‌రు కొడుకులు..’

యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్‌, ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబె, కీప‌ర్ సంజూ శాంస‌న్‌లు మాత్ర‌మే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స్క్వాడ్ నుంచి జింబాబ్వే టూర్‌కు ఎంపిక అయ్యారు. వీరితో పాటు టీ20ప్ర‌పంచ‌క‌ప్‌కు ట్రావెలింగ్ రిజ‌ర్వుగా ఉన్నా రింకూ సింగ్, ఖ‌లీల్ అహ్మ‌ద్ సైతం ఈ ముగ్గురితో పాటు కొంత ఆల‌స్యంగా జింబాబ్వేకు వెళ్ల‌నున్నారు.

జింబాబ్వేకు విమానం ఎక్కిన వారిలో శుభ్‌మ‌న్ గిల్‌, అభిషేక్ శ‌ర్మ‌, ముకేశ్ కుమార్‌ల‌తో పాటు కోచ్ ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు ఉన్నారు. జింబాబ్వే ప‌ర్య‌ట‌న జూలై 6 నుంచి ప్రారంభం కానుంది. 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచులు సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 3, సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 4, సోనీ స్పోర్ట్స్‌ టెన్‌ 5 ఛానల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

Rahul Dravid : వెళ్తూ వెళ్తూ.. విరాట్ కోహ్లికి ఓ బాధ్య‌త అప్ప‌గించిన రాహుల్ ద్ర‌విడ్‌..

జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, శివమ్‌ దూబే, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, సంజూ శాంసన్‌, దృవ్‌ జురెల్‌, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌, ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, తుషార్‌ దేశ్‌పాండే

టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జూలై 6న‌
రెండ‌వ టీ20 – జూలై 7న‌
మూడ‌వ టీ20 – జూలై 10న‌
నాలుగో టీ20 – జూలై 13న‌
ఐదో టీ20 – జూలై 14న‌
మ్యాచులు అన్నీ కూడా హ‌రారే వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి.

ట్రెండింగ్ వార్తలు