డియర్ నరేంద్ర మోదీ సర్…! ప్రధానికి విరాట్ కోహ్లీ కృతజ్ఞతలు.. ఎందుకంటే

మ్యాచ్ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Virat Kohli Narendra Modi : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

Also Read : Suryakumar Yadav : ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ క్యాచ్‌పై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఏమన్నారంటే?

మోదీ ట్వీట్ ప్రకారం.. ప్రియమైన విరాట్ కోహ్లీ.. మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. ఫైనల్స్ లో ఇన్నింగ్స్ లా మీరు భారత బ్యాటింగ్ ను అద్భుత స్థాయికి తీసుకెళ్లారు. మీరు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లలో అద్భుత ఆటతీరును కనబర్చారు. టీ20 క్రికెట్ మిమ్మల్ని కోల్పోతుంది. కానీ, మీరు కొత్తతరం ఆటగాళ్లను ప్రేరేపిస్తూనే ఉంటారన్న నమ్మకం నాకుందని మోదీ అభినందించారు. ప్రధాని మోదీ ట్వీట్ కు విరాట్ కోహ్లీ రీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : Hardik Pandya : టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. స్పందించ‌ని హార్దిక్ భార్య‌.. విడాకుల రూమ‌ర్ల‌కు ఆజ్యం..!

విరాట్ కోహ్లీ ట్వీట్ ప్రకారం.. ప్రియమైన నరేంద్ర మోదీ సార్.. మీ మంచి మాటలకు, ఎప్పుడూ మీ మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. టీ20 ప్రపంచ కప్ ను ఇంటికి తీసుకువచ్చిన ఈ భారత జట్టులో భాగమైనందుకు గర్వంగా ఉంది. ఈ విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. దేశ ప్రజలందరూ పొందిన ఆనందాన్ని చూసి ముగ్దులయ్యాము అని కోహ్లీ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ మొత్తంలో ఓపెనర్ గా కోహ్లీ బరిలోకి దిగారు. అయితే, ఏడు ఇన్నింగ్స్ లలో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అద్భుత బ్యాటింగ్ తో 59 బంతుల్లో 76 పరుగులు చేసి భారత్ జట్టు విజయంలో కోహ్లీ కీలక భూమిక పోషించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు