Hardik Pandya : టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. స్పందించ‌ని హార్దిక్ భార్య‌.. విడాకుల రూమ‌ర్ల‌కు ఆజ్యం..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ మ‌రోసారి కైవ‌సం చేసుకోవ‌డంలో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న వంతు పాత్ర‌ను పోషించాడు.

Hardik Pandya : టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. స్పందించ‌ని హార్దిక్ భార్య‌.. విడాకుల రూమ‌ర్ల‌కు ఆజ్యం..!

Hardik Pandya-Natasa Stankovic

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్ మ‌రోసారి కైవ‌సం చేసుకోవ‌డంలో టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బ్యాట్‌, బాల్‌తో స‌త్తా చాటాడు. ప్ర‌స్తుతం అత‌డి పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. కాగా.. గ‌త కొంత‌కాలంగా పాండ్యా వ్య‌క్తిగ‌త జీవితం పై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అత‌డి స‌తీమ‌ణి నటాసా స్టాంకోవిక్ తో అత‌డు విడాకులు తీసుకుంటున్న‌ట్లుగా ఆ వార్త‌ల సారాంశం.

అయితే.. ఈ వార్త‌ల‌పై అటు న‌టాషా గానీ ఇటు హార్దిక్ పాండ్యా గానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా స్పందించ‌లేదు. న‌టాషా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అయితే.. టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ సాధించిన‌ప్ప‌టికి ఆమె ఎలాంటి పోస్టులు చేయ‌లేదు. త‌న భ‌ర్త హార్దిక్ పాండ్యా ప్ర‌ద‌ర్శ‌న గురించి కూడా స్పందించలేదు. రోహిత్ శ‌ర్మ భార్య రితికా, విరాట్ స‌తీమ‌ణి అనుష్క‌లతో పాటు ఆయా క్రికెట‌ర్ల భార్య‌లు త‌మ భ‌ర్త‌ల ప్ర‌ద‌ర్శ‌న‌పై సోష‌ల్ మీడియాలో స్పందించారు.

Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..

అయితే.. న‌టాషా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్ట్ చేయ‌లేదు. ఆమె ఐపీఎల్‌కు ముందు నుంచి హార్దిక్ దూరంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఇంత‌క ముందు ఆమె పేరు నటాసా స్టాంకోవిచ్ పాండ్యాగా ఉండేది. ఇటీవ‌ల త‌న పేరులో పాండ్యాను తొల‌గించింది. అప్ప‌టి నుంచి విడాకులు వార్త‌లు మొద‌లు అయ్యాయి.

ఇక పాండ్యా ఆడే మ్యాచుల‌కు గ‌తంలో ఆమె హ‌జ‌ర‌వుతూ వ‌చ్చేది. ఐపీఎల్ 17వ సీజ‌న్ నుంచి ఆమె ఒక్క మ్యాచ్‌కు కూడా రాలేదు. ఇప్పుడు భ‌ర్త సాధించిన విజ‌యంపై మాట్లాక‌పోవ‌డంతో మ‌రోసారి పాండ్యా, న‌టాషాల విడాకుల వ్య‌వ‌హ‌రం తెర‌పైకి వ‌చ్చింది.

IND-W vs SA-W : పాపం ద‌క్షిణాఫ్రికా.. మొన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు..

న‌టాషా, హార్దిక్ పాండ్యా లు మే 2020లో కొవిడ్ లాక్‌డౌన్ స‌మ‌యంలో వివాహం చేసుకున్నారు. వీరికి 3 ఏళ్ల అగ‌స్త్య అనే కుమారుడు ఉన్నాడు.