IND-W vs SA-W : పాపం ద‌క్షిణాఫ్రికా.. మొన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు..

ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IND-W vs SA-W : పాపం ద‌క్షిణాఫ్రికా.. మొన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు..

India Women won by 10 wkts against South Africa Women in only test match

India Women vs South Africa Women : చెన్నై వేదికగా ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 37 ప‌రుగుల స్వ‌ల్ప లక్ష్యాన్ని 9.2 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ష‌ఫాలీ వ‌ర్మ 24, శుభా స‌తీష్ 13 ప‌రుగులు చేశారు. అంత‌క‌ముందు ఫాలో ఆన్ ఆడిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో 373 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త ముందు స్వ‌ల్ప ల‌క్ష్యం నిలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. షెఫాలి వర్మ (205; 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) డ‌బుల్ సెంచ‌రీతో దుమ్ములేప‌గా స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27 ఫోర్లు, 1సిక్స్‌) సెంచ‌రీతో క‌దం తొక్క‌డంతో భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 603/6 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. ఆ త‌రువాత స్పిన్నర్‌ స్నేహ రాణా 8 వికెట్ల‌తో చెల‌రేగ‌డంతో ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 266 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి ఫాలో ఆన్ ఆడింది.

Team India : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పూర్తైనా.. టీమ్ఇండియాను వ‌ద‌ల‌ని వ‌ర‌ణుడు.. ఎప్పుడొస్తారో..?

రెండో ఇన్నింగ్స్‌ల్లో లారా వోల్వార్ట్ (122; 314 బంతుల్లో 16 ఫోర్లు), సునే లూస్ (109; 203 బంతుల్లో 18 ఫోర్లు) శతకాలు బాదగా.. నాడిన్ డిక్లెర్క్‌ (61; 185 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్‌) హాఫ్ సెంచరీ బాద‌డంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఓట‌మిని త‌ప్పించుకుంది.