Rohit Sharma Mother : రోహిత్ శర్మ తల్లి పోస్ట్ వైరల్.. ‘టీ20 ప్రపంచకప్‌తో నా ఇద్దరు కొడుకులు..’
టీమ్ఇండియా విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- July 2, 2024 / 12:01 PM IST
Rohit Sharma Mother Breaks Internet With Brother On His Side Post
Rohit Sharma : 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ను ముద్దాడింది. దీంతో యావత్ భారతదేశం మొత్తం ప్రస్తుతం ఆనందడోలికల్లో తేలియాడుతోంది. కాగా.. టీమ్ఇండియా విజయం అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రోహిత్, కోహ్లి ప్రపంచ కప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఆమె తెలియజేసింది.
ప్రపంచకప్‌ను సాధించిన తరువాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జాతీయ జెండాను తమ భుజాలపై వేసుకుని టీ20 ప్రపంచకప్ పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఓ ఫోటోలో రోహిత్ తన భుజాలపై అతడి కూతురు సమైరా ఉండగా.. పక్కన కోహ్లి జాతీయ జెండాను భుజాన వేసుకుని ప్రపంచకప్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఈ ఫోటోను రోహిత్ తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Rahul Dravid : వెళ్తూ వెళ్తూ.. విరాట్ కోహ్లికి ఓ బాధ్యత అప్పగించిన రాహుల్ ద్రవిడ్..
టీ20 ప్రపంచకప్‌తో ఇద్దరు దిగ్గజాలు. రోహిత్ భుజాలపై అతడి కూతురు, దేశం మొత్తం అతడి వెనకాల, పక్కన అతడి సోదరుడు అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో వైరల్‌గా మారగా.. ఇటు కోహ్లి ఫ్యాన్స్, అటు రోహిత్ శర్మ అభిమానులు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
విరాట్ కోహ్లి నుంచి రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతలు అందుకున్నాడు. అయితే.. ఇది అంత సజావుగా జరగలేదనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్, కోహ్లిల మధ్య బంధం బెడిసికొట్టిందని కొన్నాళ్లుగా రూమర్లు వచ్చాయి. అయితే.. వీరిద్దరు ఒకరినొకరు ఎంతగా అభిమానిస్తారో పదే పదే నిరూపించుకున్నారు కూడా. ప్రస్తుతం రోహిత్ శర్మ తల్లి చేసిన పోస్ట్‌తో ఆ రూమర్లకు ఇక చెక్ పడినట్లే..
ప్రపంచ కప్ సాధించిన మరుసటి రోజు.. రోహిత్ బార్బడోస్‌లో టీ20 ప్రపంచ కప్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిచ్చాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ‘ఒక బిలియన్ కలలు, ఒక బిలియన్ భావోద్వేగాలు, ఒక బిలియన్ చిరునవ్వులు! లక్ష్యం సాధించబడింది. ప్రపంచ కప్‌ను జయించాము. మేము ప్రపంచ ఛాంపియన్లమే. కెప్టెన్ మీరు సాధించారు.’ అంటూ బీసీసీఐ రాసుకొచ్చింది.
