Rohit Sharma : ఎట్టకేలకు మట్టిని తినడానికి గల కారణాలను చెప్పిన రోహిత్ శర్మ..
టీమ్ఇండియా విజయం సాధించడంతో బార్బడోస్‌లోని పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 2, 2024 / 01:14 PM IST
Why did Rohit Sharma decide to have a bite of Barbados pitch
టీమ్ఇండియా అద్భుతం చేసింది. వరుస విజయాలు సాధిస్తూ టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత మరోసారి టీ20 ప్రపంచకప్‌ను, 11 ఏళ్ల తరువాత మరో ఐసీసీ టైటిల్‌ను అందుకుంది. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా విజయం సాధించడంతో బార్బడోస్‌లోని పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారగా రోహిత్ అలా ఎందుకు చేశాడని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. కాగా.. ఎట్టకేలకు ఈ విషయం పై రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. తాను మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని వెల్లడించాడు.
India Tour of Zimbabwe : జింబాబ్వే విమానం ఎక్కిన యువ భారత్..
బార్బడోస్ మైదానం ప్రపంచకప్‌ను ఇచ్చిందని, కాబట్టి ఈ మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటానని రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్‌లోని కొంత భాగాన్ని తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ మట్టిని తిన్నట్లుగా తెలిపాడు. కాగా.. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవని అన్నాడు. కల నెరవేరిందని రోహిత్ అన్నాడు.
తాము ప్రపంచకప్‌ను సాధించామనే విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నట్లుగా చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటికి ఇప్పటికి ఓ కలలా అనిపిస్తోందన్నాడు. తెల్లవారుజాము వరకు అందరం కలిసి సంబరాలు చేసుకున్నామని చెప్పారు. ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైందని, ఈ విజయాన్ని ఇంకా పూర్తిగా తాము ఆస్వాదించలేదన్నాడు.
