Suryakumar Yadav : ఫైనల్ మ్యాచ్‌లో విన్నింగ్ క్యాచ్‌పై స్పందించిన సూర్యకుమార్ యాదవ్.. ఏమన్నారంటే?

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ కూడా ఒకటని చెప్పొచ్చు..

Suryakumar Yadav

Suryakumar yadav Catch In T20 WC 2024 Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా జట్ల మధ్య చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే, టీమిండియా విజయానికి ప్రధాన కారణాల్లో మ్యాచ్ చివర్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీలైన్ వద్ద పట్టిన క్యాచ్. చివరి ఓవర్లో దక్షిణాఫ్రికా జట్టు 16పరుగులు చేయాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయగా.. క్రీజులో ఉన్న మిల్లర్ మొదటి బంతినే భారీ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి గాల్లోకి ఎగిరి బౌండరీ బయట పడబోయే సమయంలో రాకెట్ వేగంతో దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. సూర్యకుమార్ అందుకున్న అద్భుత క్యాచ్ తో మ్యాచ్ పూర్తిగా భారత్ కు అనుకూలంగా మారింది.

Also Read : Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..

టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడానికి ప్రధాన కారణాల్లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అద్భుత క్యాచ్ అందుకోవడంతో సూర్యపై ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా.. ఈ క్యాచ్ పై సూర్య కుమార్ యాదవ్ స్పందించారు. టైమ్స్ ఆప్ ఇండియాతో సూర్య మాట్లాడుతూ.. నేను క్యాచ్ అందుకునే సమయంలో నా మనస్సులో ఏమి జరుగుతుందో నాకు నిజంగా తెలియదు. నేను ప్రపంచ కప్ ఎగురుతూ చూస్తున్నాను.. దానిని పట్టుకున్నాను అని చెప్పాడు.

Also Read : IND-W vs SA-W : పాపం ద‌క్షిణాఫ్రికా.. మొన్న అబ్బాయిలు.. నేడు అమ్మాయిలు..