T20 World Cup 2026 : 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ 20 జ‌ట్లు.. ఆతిథ్యం ఎవ‌రంటే..? ఇప్ప‌టికే 12 అర్హ‌త‌.. ఇంకా..

ఇప్పుడు అంద‌రి దృష్టి 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది.

17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత టీమ్ఇండియా మ‌రోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. శ‌నివారం బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో ద‌క్షిణాఫ్రికాను 7 ప‌రుగుల తేడాతో ఓడించిన భార‌త్ విశ్వవిజేత‌గా నిలిచింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే తొలి సారి 20 జ‌ట్లు ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పోటీ ప‌డ్డాయి. ఇక ఇప్పుడు భార‌త్ విశ్వ విజేత‌గా నిల‌వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పై ప‌డింది.

2026లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించిన వివ‌రాల‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుద‌ల చేసింది. ఈ ప్ర‌పంచ‌కప్‌కు భార‌త్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ 20 దేశాలు పాల్గొన‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి-మార్చిలో ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇటీవల ముగిసిన పొట్టి కప్‌ మాదిరిగానే రెండు ప్రాథమిక రౌండ్లు, నాకౌట్‌గా టోర్నీ ఉంటుంది.

India Tour of Zimbabwe : జింబాబ్వే విమానం ఎక్కిన యువ భార‌త్‌..

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో 20 దేశాలు పాల్గొన‌నుండగా 12 దేశాలు నేరుగా అర్హ‌త సాధించాయి. ఆతిథ్య దేశాల హోదాలో భార‌త్‌, శ్రీలంక‌తో పాటు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ 8కు చేరుకున్న అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఉన్నాయి. ఇక 2024 జూన్ 30 వ‌ర‌కు ఉన్న ఐసీసీ ర్యాంకుల ఆధారంగా మ‌రో మూడు జ‌ట్లు పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ లు అర్హ‌త సాధించాయి.

ప్రాంతీయ క్వాలిఫైయ‌ర్ల ద్వారా ఎనిమిది జ‌ట్లు అర్హ‌త సాధించ‌నున్నాయి. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లు ఒక్కొక్కటి రెండు క్వాలిఫికేషన్ స్లాట్‌ల‌ను కలిగి ఉండ‌గా.. అమెరికా, తూర్పు-ఆసియా పసిఫిక్ ఒక్కొ స్లాట్ ను క‌లిగి ఉంది.

Rohit Sharma Mother : రోహిత్ శ‌ర్మ త‌ల్లి పోస్ట్ వైర‌ల్.. ‘టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌తో నా ఇద్ద‌రు కొడుకులు..’

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ‌క‌ప్‌కు అర్హ‌త సాధించిన 12 దేశాలు ఇవే..

భార‌త్‌, శ్రీలంక‌, అఫ్గానిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్.

ట్రెండింగ్ వార్తలు