Koti : సంగీత దర్శకుడు కోటి.. ఆస్ట్రేలియాలో లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు దక్కించుకున్న మొదటి భారతీయ సంగీత దర్శకుడు..

సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు.

Music Director Koti :  తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. అది మరెవరికో కాదు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కోటి. ఎంతోమంది స్టార్ హీరోలకు, ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించి, ఎన్నో మంచి పాటలను అందించిన సంగీత దర్శకుడు కోటి.

సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను అభినందిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్లో జరిగిన సెలబ్రేషన్ ఆఫ్ మ్యూజిక్ లో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. Hon. జూలియా ఫిన్(M.P) మెంబర్ అఫ్ న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఈ లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుని కోటి గారికి అందించారు. కోటి ఈ అవార్డు తీసుకున్న అనంతరం ఎమోషనల్ గా మాట్లాడారు.

Gulshan Devaiah : తమన్నా ఎవరో కూడా నాకు తెలీదు.. విజయ్ ని ఆటపట్టించడానికే అబద్దం ఆడాను..

సంగీత దర్శకుడు కోటి ప్రసంగిస్తూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులకు మరియు ఐక్యరాజ్యసమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి, తన పురస్కారాన్ని భారతదేశానికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించి జైహింద్ అన్నారు. దీంతో పలువురు సంగీతాభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కోటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు