Thank You : క్యూట్ పెయిర్..

‘థ్యాంక్యూ’ సినిమాకి సంబంధించి నాగ చైతన్య - రాశీ ఖన్నాల లీక్డ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది..

Thank You: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా.. ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’..

Rakul Preet Singh: రకుల్ పెళ్లికి వేళాయే.. త్వరలోనే! వరుడు ఎవరంటే?

బి.వి.ఎస్.రవి కథ, మాటలు అందిస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 20వ చిత్రమిది. పాండమిక్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఇటీవలే బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్‌తో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిపారు. ఈ సినిమాలో చైతు, రాశీ ఖన్నా కలిసి ఉన్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

చై, రాశీల పెయిర్ బాగుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి, త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు. ఇటీవలే ‘లవ్ స్టోరీ’ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న చైతు, సమంతతో విడిపోయిన తర్వాత రిలీజ్ కాబోయే సినిమా ఇదే కావడంతో.. రిజల్ట్ గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.

Evaru Meelo Koteeswarulu : డబ్బులు కావాలంటున్న సమంత..

ట్రెండింగ్ వార్తలు