Kamal Haasan : శ్రీ శ్రీ మహా ప్రస్థానం.. కమల్ హాసన్ ఆకలి రాజ్యం.. కల్కి సినిమా.. 44 ఏళ్ళ తర్వాత.. లింక్ ఏంటి?
కల్కి క్లైమాక్స్ లో కమల్ హాసన్.. 'జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను' అని తన బేస్ వాయిస్ తో చెప్తారు. ఈ కవిత శ్రీ శ్రీ మహాప్రస్థానంలోనిది.
- Saketh U
- Published On : June 29, 2024 / 10:09 AM IST
Kamal Haasan Kalki Dialogue from Sri Sri Maha Prasthanam said before 44 Years in Akali Rjyam Movie
Kamal Haasan : ప్రభాస్ కల్కి 2898AD సినిమా థియేటర్స్ లో హిట్ టాక్ తో సందడి చేస్తుంది. సినిమా చూసిన ప్రేక్షకులు కల్కి విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. కల్కి మొదటి రోజే 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న సుప్రీమ్ యాస్కిన్ అనే పాత్రలో కనిపించారు.
కల్కి సినిమా మొత్తం మీద కమల్ హాసన్ మహా అయితే 10 నిముషాలు కనిపిస్తారేమో. సినిమా క్లైమాక్స్ లో కమల్ హాసన్ సీన్ అదిరిపోతుంది. ఆ సీన్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ. అయితే కల్కి క్లైమాక్స్ లో కమల్ హాసన్.. ‘జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను’ అని తన బేస్ వాయిస్ తో చెప్తారు. ఈ కవిత శ్రీ శ్రీ మహాప్రస్థానంలోనిది.
Also Read : Kamal Haasan : పార్ట్ 2లో ఎక్కువ సేపు కనిపిస్తాను.. పార్ట్ 3 కూడా.. కల్కి సినిమాపై కమల్ హాసన్ వ్యాఖ్యలు..
ఇదే కవిత కమల్ హాసన్ 44 ఏళ్ళ క్రితం ఆకలి రాజ్యం సినిమాలో చెప్తారు. ఆ సినిమాలో కమల్ హాసన్ శ్రీ శ్రీ వీరాభిమాని. ఆకలిరాజ్యం సినిమాలో కూడా కమల్ హాసన్ శ్రీ శ్రీ మహా ప్రస్థానంలో ఈ కవిత.. పతితులార.. భ్రష్టులార.. బాధాసర్ప దష్టులార.. దగాపడిన తమ్ములార.. ఏడవకండి ఏడవకండి.. జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్ వస్తున్నాయ్.. రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను.. భూకంపం పుట్టిస్తాను అని చెప్తాడు.
దీంతో ఇప్పుడు ఆకలిరాజ్యం కమల్ హాసన్ సీన్ వైరల్ అవుతుంది. 40 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ మళ్ళీ అదే డైలాగ్ కల్కి సినిమాలో చెప్పాడంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇక కల్కి పార్ట్ 2లో కమల్ హాసన్ ఎక్కువ సేపు కనపడనున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
