Nagaland Assembly: దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్

అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది

Nagaland Assembly: నాగాలాండ్ రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీలో పేపర్ పత్రాలకు స్వస్తి పలుకుతూ ఎలక్ట్రానిక్ పద్దతిని ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో మొట్టమొదటిసారిగా కాగిత రహిత అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. పేపర్ స్థానంలో “నేషనల్ ఇ-విధాన్ అప్లికేషన్ (NeVA)” విధాన్నాన్ని తీసుకువచ్చారు. దేశంలోని ప్రభుత్వ శాఖలు, శాసన సంబంధమైన సమావేశాలు, ఇతర ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాల్లోనూ కాగిత రహిత కార్యకలాపాల దిశగా కేంద్ర ప్రభుత్వం NeVA విధాన్నాన్ని తీసుకువచ్చింది. అయితే దేశంలోనే మొదటిసారిగా ఈ విధాన్నాన్ని నాగాలాండ్ అసెంబ్లీలో అమలు చేయడంపై షేరింగైన్ లాంగ్‌కుమర్ మాట్లాడుతూ..”కాగిత రహిత సభను ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా అసెంబ్లీలో ఈ NeVA అప్లికేషన్‌ను ఉపయోగించేందుకు సభ్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు” తెలిపారు. NeVA ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇదే విధమైన వ్యవస్థ అమలులో ఉంది, దేశంలోని ఇతర రాష్ట్ర అసెంబ్లీలు సైతం ఈదిశగా అడుగులువేస్తున్నాయని లాంగ్‌కుమర్ చెప్పారు.

Also read: Fake Vehicle Sticker : నగరంలో పోలీసుల తనిఖీలు.. దొంగ స్టిక్కర్స్ వాహనాలపై నిఘా

ఈ NeVA విధానం ద్వారా శాసనసభలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో స్మార్ట్ టాబ్లెట్ ను వారి వారి సీట్ల వద్ద అమర్చుతారు. టాబ్లెట్ లో ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ లో సభ్యుని వివరాలు, పాటించాల్సిన నియమాలు, వ్యాపార జాబితా, నోటీసులు, బులెటిన్‌లు, బిల్లులు, మార్క్ చేయబడ్డ ప్రశ్నలు మరియు సమాధానాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఉంచుతారు. ఆ అప్లికేషన్ ను డేటాబేస్ కు అనుసంధానిస్తారు. సభ్యులు అప్లికేషన్ ను సమర్ధవంతంగా నిర్వహించేవిధంగా ముందుగా శాఖలవారీగా వారికి శిక్షణ ఇస్తారు. సాఫ్ట్‌వేర్‌లో ఈ -పత్రాలను ఇంగ్లీష్ మరియు ఏదైనా ప్రాంతీయ భాషలో తర్జుమా చేసుకునే వీలుంటుంది.

Also read: CM KCR Meeting : మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.. ఉద్యోగాల భర్తీ-జాబ్ కేలండర్, ధాన్యం కొనుగోళ్లపై చర్చ

శాసనసభ ద్వారా జరిగే అన్ని పనులను సులభతరం చేయడానికి ఇ-అసెంబ్లీ విధాన్నాన్ని తీసుకువచ్చారు. కాగిత రహితంగా శాసనసభ కార్యకలాపాలు సాగేలా వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. జాతీయ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఇది జరుగుతోంది.

Also read: Japan – India: జపాన్ ప్రధానితో మోదీ భేటీ: ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలపై చర్చ

ట్రెండింగ్ వార్తలు