గెలుపోటములపై పార్టీలు, నేతల లెక్కలు.. ఎన్నికలు ముగిశాయ్.. ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసా?

గెలుపోటములు దేవుడు డిసైడ్‌ చేస్తాడంటూ పైవాడికి వదిలేస్తున్నారు కొందరు అభ్యర్థులు.

ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారో తెలియాలంటే మరో మూడు వారాలు ఆగక తప్పదు. కనీసం ఎగ్జిట్‌ పోల్స్‌ తెలియాలన్నా.. జూన్‌ 1వరకు ఆగాల్సిందే. ఎన్నికల ప్రచారం, పోలింగ్ హడావుడి ముగిసినా ఫలితాల ఎలా ఉంటాయోనని అటు అభ్యర్థులను, ఇటు పార్టీలను టెన్షన్ పెడుతోంది.

ఎన్నికలు ముగిసినా నేతలకు టెన్షన్ తప్పడం లేదు. ప్రచారం ముగిసి.. ఎన్నికలు అయిపోయినా..ఫలితాల కోసం ఎదురుచూపులతో లీడర్లలో ఉత్కంఠ పెరుగుతోంది. రాజకీయ భవిష్యత్‌పై ఆందోళనతో ఉన్నారు నేతలు. ఒకవేళ తాము గెలిచినా పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అని ఎనాలిసిస్ చేసుకుంటున్నారు. ఓటింగ్ సరళి, బూత్‌ల వారీగా బలాబలాలను లెక్కలు వేసుకుంటున్నారు నేతలు. ఏ బూత్‌లో మెజార్టీ వస్తుంది.. ఎక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది..ఎంత మెజార్టీతో గెలిచే అవకాశముందని.. కూడికలు, తీసివేతలతో ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

20రోజుల వెయిటింగ్ టైమ్‌
మే 13న పోలింగ్ అయిపోయింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. అంటే మధ్యలో 20రోజుల వెయిటింగ్ టైమ్‌ ఉంది. ఎన్నికలు అయిపోయాయి రిలాక్స్ అవుదామనుకున్న నేతలను ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయి. అన్నీపణంగా పెట్టి పోరాడాం.. రిజల్ట్‌ ఎలా వస్తుందో.. పొలిటికల్ ఫ్యూచర్‌ ఏంటో అన్నదానిపై లీడర్లలో ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అయితే గతంలో పోలింగ్‌కు.. రిజల్ట్‌కు 40రోజుల గ్యాప్‌ ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు నేతలు.

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు, కంటోన్మెంట్‌ బైపోల్‌కు ఎన్నికలు జరిగాయి. 17 ఎంపీ సెగ్మెంట్లలో 525 మంది..కంటోన్మెంట్ బరిలో 45మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలంగాణలో పార్లమెంట్‌ ఫలితాలపై అన్ని పార్టీలు ధీమాలో ఉన్నాయి. 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్, కనీసం పది సీట్లు గెలుస్తామని బీజేపీ.. 8 నుంచి 12 సీట్లు సొంతం చేసుకుంటామని బీఆర్‌ఎస్‌ చెప్పుకుంటున్నాయి.

ఏపీలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు జరిగాయి. 25 పార్లమెంట్ సెగ్మెంట్లలో 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ సీట్లలో 2వేల 387 మంది క్యాండిడేట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై ఇటు ప్రజలు.. అటు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. సర్వేలు, అంచనాలు ఎలా ఉన్నా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందోనన్న దానిపై పార్టీలతో పాటు అభ్యర్థుల్లో కలవరం కొనసాగుతోంది.

పోలింగ్ పర్సంటేజ్‌పై లెక్కలు
పోలింగ్ పర్సంటేజ్‌పై లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఎవరికి ఎడ్జ్‌ ఇస్తుందనే దానిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు అభ్యర్థులు. పోలింగ్ సరళి, బూత్‌ల వారీగా లెక్కలతో ఎంత వడపోత పోసినా గెలుపోటములపై క్లారిటీకి రాలేకపోతున్నారు. చేసే ప్రయత్నం చేశాం.. గెలుపోటములు దేవుడు డిసైడ్‌ చేస్తాడంటూ పైవాడికి వదిలేస్తున్నారు కొందరు అభ్యర్థులు.

అటు ఏపీ, ఇటు తెలంగాణలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. కేంద్ర బలగాలు, సీసీ కెమెరాలతో నిఘా నీడలో ఉన్నాయి స్ట్రాంగ్‌ రూమ్‌లు. ఈవీఎంల భద్రత కోసం మూడు అంచెల సెక్యూరిటీ పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు కూడా నిరంతరం స్ట్రాంగ్‌ రూమ్‌లను పర్యవేక్షిస్తున్నారు.

స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బందితో భారీ బందోబస్తు పెట్టారు. అగ్ని ప్రమాదం జరిగితే దానిని నివారించేందుకు ఫైర్ ఇంజన్స్‌ ఏర్పాటు చేశారు. పవర్ సమస్యలు రాకుండా ప్రత్యేక జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గర మూడంచెల భద్రత వ్యవస్థ కొనసాగుతోంది. మొదటి లేయర్‌లో CISFసిబ్బంది, రెండు, మూడు అంచెల్లో రాష్ట్ర పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. స్ట్రాంగ్‌ రూమ్స్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు.

Botcha Satyanarayana : మళ్లీ జగనే సీఎం, విశాఖలోనే ప్రమాణ స్వీకారం- మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు