Botcha Satyanarayana : మళ్లీ జగనే సీఎం, విశాఖలోనే ప్రమాణ స్వీకారం- మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మోసాలు, అబద్దాలను ప్రజలు నమ్మలేదన్నారు. కూటమి నేతలు దిగజారి ప్రచారం చేశారని మండిపడ్డారు.

Botcha Satyanarayana : మళ్లీ జగనే సీఎం, విశాఖలోనే ప్రమాణ స్వీకారం- మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

Updated On : May 14, 2024 / 7:43 PM IST

Botcha Satyanarayana : రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. సీఎంగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన జోస్యం చెప్పారు. జూన్ 4 తర్వాత సీఎంగా విశాఖలోనే జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. అవినీతిని రూపుమాపేందుకే సచివాలయాలను ప్రవేశపెట్టామన్నారు. జగన్ చెప్పినవన్నీ చేసి చూపించారని తెలిపారు. అన్ని ప్రాంతాల వారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం అన్నారు మంత్రి బొత్స.

ఈ సందర్భంగా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మంత్రి బొత్స. చంద్రబాబు మోసాలు, అబద్దాలను ప్రజలు నమ్మలేదన్నారు. కూటమి నేతలు దిగజారి ప్రచారం చేశారని మండిపడ్డారు. నేను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లే లేఖ సృష్టించారని అన్నారు. కుట్రలతో రాజకీయాలు చేసి బయటపడాలని చూశారని.. చంద్రబాబు అంటే మాయ, మోసం, దగా అని ధ్వజమెత్తారు.

Also Read : ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు