Ranveer Singh : డాన్ 3 ఇష్యూ.. రణ్వీర్ సింగ్ ని బ్యాన్ చేయలేదా.. క్లారిటీ ఇచ్చిన FWICE చీఫ్ అడ్వైజర్..
కెరీర్ పీక్ స్టేజ్‌లోకి వెళ్తోన్న టైమ్‌లోనే డాన్ 3 మేకర్స్ నుంచి రణ్వీర్ సింగ్‌కి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.(Ranveer Singh)
Ranveer Singh
Ranveer Singh : స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ధురంధర్ సిరీస్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా కాలం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తోన్న రణ్వీర్ ఈ సినిమాతోనే కెరీర్లో హైయ్యస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ రేంజ్ హిట్‌తో కెరీర్ పీక్ స్టేజ్‌లోకి వెళ్తోన్న టైమ్‌లోనే డాన్ 3 మేకర్స్ నుంచి రణ్వీర్ సింగ్‌కి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ధురంధర్ రిలీజ్ కంటే ముందుగానే డాన్ 3 సినిమాకి ఓకే చెప్పారు రణ్వీర్. ఫర్హాన్ అక్తర్ డైరెక్ట్ చేసే ఈ బాలీవుడ్ సినిమా సీక్వెల్ నుంచి డాన్ 3 టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు రణవీర్ డాన్ 3 నుంచి తప్పుకోవడంతోనే అసలు సమస్య మొదలైంది. రణ్వీర్ సింగ్ సినిమా చేస్తారని ఇప్పటికే డాన్ 3 ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం 45 కోట్లు ఖర్చయినట్లు లీగల్ నోటీస్ రిలీజ్ చేశారు.
Also See : Mrunal Thakur : తన లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఫొటోలు..
అలాగే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ప్రెస్ మీట్ పెట్టి రణవీర్ సింగ్ ని బాలీవుడ్ నుంచి బ్యాన్ చేసినట్టు ప్రకటించింది. దీంతో ఈ బాలీవుడ్ హీరోపై 3 ఇయర్స్ బ్యాన్ ప్రకటించింది FWICE (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) అని వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్త బాలీవుడ్ లో చర్చగా మారింది. ఈ వార్త వైరల్ అవ్వడంతో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్ దీనిపై వివరణ ఇచ్చారు.
అశోక్ పండిట్ మాట్లాడుతూ.. ఇది అధికారిక బ్యాన్ కాదు. నటులపై నిషేధం విధించే అధికారం మాకు లేదు. సమస్యకు పరిష్కారం లభించే వరకూ ఆయనతో కలిసి పనిచేయొద్దని మా సభ్యులను ఆదేశించాము. ఒక సినిమా నుంచి హీరోనే కాదు ఎవరు వెళ్ళిపోయినా నిర్మాతకే నష్టం అని అన్నారు. దీంతో రణవీర్ సింగ్ పై అధికారిక బ్యాన్ లేదు అని తెలుస్తుంది. మరి రణవీర్ నుంచి బాలీవుడ్ లో నెక్స్ట్ సినిమాలు వస్తాయా ? రావా చూడాలి.
