Nayakudu Trailer : మ‌హేశ్ బాబు విడుద‌ల చేసిన నాయ‌కుడు ట్రైల‌ర్ చూశారా..?

ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), కీర్తి సురేష్ (Keerthy Suresh), వడివేలు (Vadivelu) లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం మామన్నన్ (Maamannan).

Nayakudu Trailer

Nayakudu movie Trailer : ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin), ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil), కీర్తి సురేష్ (Keerthy Suresh), వడివేలు (Vadivelu) లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం ‘మామన్నన్’ (Maamannan). మారి సెల్వరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కింది. త‌మిళనాట ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు క‌లిసి ‘నాయ‌కుడు’ ((Nayakudu)) పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాయి.

Mahnoor Baloch : షారుఖ్‌ ఖాన్‌కు న‌ట‌న రాదు.. పెద్ద అంద‌గాడేం కాదు.. న‌టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ నెల 14న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు. అందులో భాగంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరో మ‌హేశ్ బాబు(Mahesh Babu) సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. రాజ‌కీయ నాయ‌కుల అండ క‌లిగిన ఓ చోటా లీడ‌ర్‌, ఆ ప‌ట్ట‌ణంలోని ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాడు. అత‌డి ఆగ‌డాల‌కు బ‌య‌ట‌పెట్టాల‌ని సాక్షాల‌ను సేక‌రించ‌డానికి హీరో ఏం చేశాడు అన్న‌ది క‌థ‌గా తెలుస్తోంది. ఏ ఆర్ ర‌హ‌మాన్ అందించిన సంగీతం బాగుంది.

Korean soprano singer Lee Sang Eun : ప్ర‌ద‌ర్శ‌న‌కు టైమ్ అవుతున్నా.. స్టేజ్ పైకి రాని సింగర్‌.. బాత్రూమ్‌లో క‌నిపించిన దృశ్యం చూసి అంతా షాక్‌

 

 

ట్రెండింగ్ వార్తలు