Tattoos : ఇలాంటి టాటులు అస్సలు వేయించుకోవద్దు.. శనిని శరీరంపై డిజైన్ చేయించున్నట్లే!

పువ్వుల్ని చూస్తే ఆనందం కలుగుతుంది. అది పాజిటివ్ ఎనర్జీ. అదే రక్తాన్ని చూస్తే భయం కలుగుతుంది. అది నెగిటివ్ ఎనర్జీ. పండును చూస్తే తినాలపిస్తుంది. అది పాజిటివ్. అదే పామును చూస్తే భయం కలుగుతుంది. భయం అంటే నెగిటివ్. అలాగే మనం చూస్తే ఏదైనా పాజిటివ్ గా ఉండాలి. మన ఆలోచనలు పాజిటివ్ గా ఉండాలి. అటువంటిది మన శరీరంపై ఎంతో ముచ్చటపడి వేయించుకునే టాటూ డిజైన్ కూడా పాజిటివ్ గా ఉండాలి.

Negative Tattoos Designs

Negative Tattoos Designs : ఒకప్పుడు పచ్చబొట్టు అనేవారు. ఇప్పుడు కాస్త ఫ్యాషన్ గా టాటూలు అంటున్నారు. పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు నొప్పి ఉంటుంది. కానీ టాటూలు కాస్త ఈజీగా వేస్తారు. రకరకాల డిజైన్లలో టాటూలు వేయించుకోవటం ఫ్యాషన్ గా మారిపోయింది. కొంతమంది అయితే ఏకంగా ఒళ్లంతా వేయించేసుకుంటారు. కానీ టాటూల వేయించుకుంటే ఈ డిజైన్ లో ఓ అర్థం ఉండాలి. అలా ప్రతీ టాటూకు ఓ అర్థం ఉండేలా ఉండాలి.

పువ్వుల్ని చూస్తే ఆనందం కలుగుతుంది. అది పాజిటివ్ ఎనర్జీ. అదే రక్తాన్ని చూస్తే భయం కలుగుతుంది. అది నెగిటివ్ ఎనర్జీ. పండును చూస్తే తినాలపిస్తుంది. అది పాజిటివ్. అదే పామును చూస్తే భయం కలుగుతుంది. భయం అంటే నెగిటివ్. అలాగే మనం చూస్తే ఏదైనా పాజిటివ్ గా ఉండాలి. మన ఆలోచనలు పాజిటివ్ గా ఉండాలి. అటువంటిది మన శరీరంపై ఎంతో ముచ్చటపడి వేయించుకునే టాటూ డిజైన్ కూడా పాజిటివ్ గా ఉండాలి. ఎందుకంటే దాన్ని చూస్తే మనకు పాజిటివ్ ఆలోచనలు..పాజిటివ్ ఎనర్జీ రావాలి.అంతేతప్ప నెగిటివ్ థింకింగ్ రాకూడదు.

కొన్ని టాటూల వల్ల నెగిటివ్‌ ఎనర్జీ వస్తుందట. ఫ్యాషన్‌ కోసం వేయించుకుని నెగిటివ్ ను కోరి తెచ్చుకునేలా ఉండకూడదు. కాబట్టి మంచి డిజైన్లు వేయించుకోవాలి. శరీరంపై వేయించుకున్న డిజైన్ టాటూ చూస్తే మీ మైండ్‌ కరాబ్‌ అవ్వకుండా కాస్తా చిరునవ్వు వచ్చేలా.. ఉండాలి. కొన్ని రకాల టాటూ డిజైన్లను ఎప్పటికీ శరీరం మీద వేసుకోకూడదని..మంచి డిజైన్లు వేయించుకుంటే మంచి ఆలోచనలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల టాటూల వల్ల నెగిటివ్ ఆలోచనలు వస్తాయని అటువంటివి వేయించుకోకూడదని పండితులు కూడా చెబుతున్నారు.

Sacred Waist Thread For Men : మగవాళ్లకు మొలతాడుకు సంబంధమేంటీ..? భారతీయ సంప్రదాయం వెనుక సైన్స్

సాధారణంగా ఇంట్లో పగిలిన వస్తువులు ఉండకూడదంటారు. అద్ధంలాంటివి పగిలితే ఇంట్లో ఉండకూడదంటారు. అలాగే కొన్ని రకాల వస్తువులు తిరగేసి ఉండకూడదంటారు. ఉదాహరణకు చేట, బియ్యం కొలుచుకునే తవ్వ,కుంచం (కొలతలకు ఉపయోగించేవి)లాంటివి. అలాగే ఉంట్లో ఎవ్వరు బాధగా విచారంగా ఏడుస్తు ఉండకూడదంటారు. ఇటువంటివన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ ను కలిగిస్తాయి. అటువంటి టాటూలు వద్దంటున్నారు నిపుణులు.

పగిలిన అద్దం
పగిలిన అద్దం డిజైన్ అసలు శరీరం మీద వేసుకోకూడదు. పగిలిన అద్దం దురదృష్టానికి సంకేతం. పగిలిన అద్దంలో ప్రతిబింబం చూడకూడదంటారు. ఎందుకంటే పగిలిన అద్ధంలో మన ముఖం మనకే వికృతంగా షేప్ అవుట్ గాను కనిపిస్తుంది. అటువంటి డిజైన్లు అంటే చిందరవందంగా ఉండే అర్థం పర్థం లేని డిజైన్లు శరీరంపై వేసుకోవడం అశుభం అని సూచిస్తున్నారు. ఇది జీవితంలోకి ప్రతికూలతను ఆహ్వానించేనట. ఇటువంటి టాటూలు శరీరం మీద వేయించుకున్న వారికి వ్యక్తిగత, వృత్తిపరమైన, వ్యాపార సంబంధ సమస్యలు వస్తాయంటున్నారు.

తిరగబడిన గుర్రపు డెక్క
గుర్రపు డెక్క గుర్తు అదృష్టానికి సంకేతం. అయితే ఇది తిరగబడినట్లుగా టాటూ వేయించుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయట. తిరగబడిన గుర్రపు డెక్క డిజైన్ జీవితంలోని పాజిటివిటిని హరించే అశుభ సంకేతం. ఈ డిజైన్ శరీరం మీద వేయించుకుంటే దురదృష్టాన్ని ఆహ్వానించినట్టేనట.

పగిలిన గడియారం
పగిలిన గడియారం దురదృష్టానికి సంకేతం. వాస్తు ప్రకారం పగిలిన గడియారం ఆగిపోయిన సమయానికి చిహ్నం. అలాంటి పచ్చ బొట్టు శరీరం మీద వేసుకుంటే జీవితంలో పురోగతి కుంటుపడుతుంది.గడియారం అంటే సమయాన్ని సూచించేదే కాదు.. టైమ్ అంటే గ్రహాల కదలికలను బట్టి కదిలేది. కాబట్టి పగిలిని గడియారం బొమ్మ టాటూగా వేయించుకుంటే అది నెగిటివ్ కు చిహ్నంగా ఉంటుందట.

విచారంగా ఉండే ముఖం..
విచారంగా కనిపించే ముఖాలు ప్రతికూల భావనలు కలిగిస్తాయి. అందుకే ఇంట్లో ఎవరన్నా ఏడిస్తే అశుభం అంటారు. అటువంటి ముఖం దురదృష్టాన్ని ఆకర్షించేవిగా ఉంటాయి. జీవితంలో భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. వాటిని వ్యక్తం చేసే విధానం మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. దుఖాన్ని తెలిపే పచ్చబొట్టు డిజైన్లు శరీరం మీద వేయించుకుంటే జీవితంలో అశుభాలు జరుగుతాయని శాస్త్రం చెబుతోంది.

వీటితో పాటు మనిషి పుర్రె, పిల్లి, గబ్బిలం, పాము, తేలు, పాలెపురుగు, బల్లి వంటి టాటూలు కూడా మీ జీవితానికి హానికరం అని పండితులు చెప్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు