Netflix : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారా? ఇకపై కష్టమే.. పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

నెట్‌ఫ్లిక్స్ ఒకరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అదే లాగిన్స్‌తో ఇంకో నలుగురు వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ బట్టి ఆ వెసలుబాటు ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఒకరు లాగిన్స్ ఒకరు కొనుక్కొని నలుగురు వాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఒక లాగిన్ కొనుక్కొని మరో నలుగురికి నెట్‌ఫ్లిక్స్ కంటే తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు.

Netflix Password sharing new restrictions in India full details here

Netflix Password :  ప్రపంచంలోని టాప్ ఓటీటీలలో ఒకటి నెట్‌ఫ్లిక్స్. కరోనా తర్వాత ఓటీటీలకు డిమాండ్ పెరగడంతో నెట్‌ఫ్లిక్స్‌కి కూడా లాభాల పంట పండింది. ఇక నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెట్ మీద కరోనా తర్వాత దృష్టి పెట్టి ఇక్కడ కూడా లోకల్ భాషల్లో సిరీస్‌లు, సినిమాలు చేస్తుంది. ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లకు ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు. ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్ తన కంటెంట్ పరిధిని పెంచుతుంది.

అయితే నెట్‌ఫ్లిక్స్ ఒకరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అదే లాగిన్స్‌తో ఇంకో నలుగురు వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ బట్టి ఆ వెసలుబాటు ఉంది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఒకరు లాగిన్స్ ఒకరు కొనుక్కొని నలుగురు వాడుకుంటున్నారు. కొంతమంది అయితే ఒక లాగిన్ కొనుక్కొని మరో నలుగురికి నెట్‌ఫ్లిక్స్ కంటే తక్కువ ధరకి అమ్ముకుంటున్నారు. దానివల్ల నెట్‌ఫ్లిక్స్‌కి ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ రావట్లేదు. ఆదాయం కూడా తగ్గుతుంది. దీంతో మొత్తానికే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ తీసేయకుండా కొత్తగా నిబంధనలను తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌ని ఇప్పటి నుంచి కేవలం ఒక ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ మాత్రమే వాడేలా నిబంధనలు తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ బయట కొత్తవాళ్ళకి, ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోలేము. కొన్ని నెట్‌ఫ్లిక్స్ అకౌంట్స్ టీవీ‌లకు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆ టీవీ, ఆ ఇంట్లో వైఫై, ఆ ఇంట్లో ఫోన్ ఐపీ అడ్రెస్‌లను ఆధారంగా చేసుకొని వాటివరకు మాత్రమే నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేర్ అయ్యేలా నిబంధనలు వర్తించింది. దీంతో ఒక వైఫై కనెక్టివిటీ దాటి ఇంకో వైఫై కనెక్టివిటీలో, ఇంకో టీవిలో నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ అవ్వదు.

Nandu : నందు, అవికా గోర్ కాంబినేషన్లో కొత్త సినిమా..

ఈ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ రిస్ట్రిక్షన్స్ మొదటిసారి అమెరికాలో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, ఇండోనేషియా.. ఇలా పలు దేశాల్లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఇండియాలో కూడా ఈ నిబంధనలను తీసుకొచ్చింది నెట్‌ఫ్లిక్స్. దీనివల్ల ఆల్రెడీ కొంతమంది సబ్‌స్క్రైబర్స్ పెరిగారట నెట్‌ఫ్లిక్స్ కి. దీనివల్ల నెట్‌ఫ్లిక్స్ అకౌంట్స్ కొని రీ సేల్ చేసే వాళ్ళు చేయలేరు. మనం కూడా బయటి వాళ్లకు అకౌంట్ లాగిన్స్ ఇవ్వలేము. ఒక ఇంట్లో మాత్రమే షేర్ చేసుకునేలా ఇచ్చారు కాబట్టి కొన్ని చోట్ల అందరి ఇళ్లల్లో అందరూ వాడరు. దీనివల్ల నెట్‌ఫ్లిక్స్ కి ఎంతోకొంత బెన్ఫిట్ అయితే జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి నెట్‌ఫ్లిక్స్ లాగిన్స్ కొనుక్కునేటప్పుడు ఆలోచించి కొనుక్కోండి.

ట్రెండింగ్ వార్తలు