COVID-19: మళ్లీ భయపెడుతున్న కరోనా మహమ్మారి.. దేశంలో భారీగా పెరుగుతున్న కొత్త కేసులు ..

భారత్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి.

COVID-19: కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభించేందుకు సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడిస్తున్న రోజువారి గణాంకాలు కూడా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ప్రతీరోజూ కొత్తగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత‌నెల ప్రారంభంలో వందల సంఖ్యలో ఉన్న రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం దాదాపు నాలుగు వేలకు చేరింది. రోజురోజుకు ఊహించని స్థాయిలో రోజువారి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలపై కేంద్రం దృష్టిసారించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులకు కీలక సూచనలు చేస్తున్నారు. తద్వారా కొవిడ్ వ్యాప్తిని అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

Covid-19: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో 3824 కొత్త కేసులు

భారత్‌లో రోజురోజుకు కరోనా కొత్త కేసులసంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో (శనివారం) దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రోజురోజుకు కోవిడ్ కొత్త కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది.

Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..

దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (శనివారం ఒక్కరోజు) ఢిల్లీలో కొత్తగా 429 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఏడు నెలల తరువాత ఢిల్లీలో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం ఇస్తున్న సూచనలు పాటిస్తూ కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో 1395 యక్టీవ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పటివరకు 20,10,741 కేసులు నమోదు కాగా, 26530 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.09 శాతంగా ఉంది. ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు