Adipurush: ఆదిపురుష్ నుండి మరో అప్డేట్.. వచ్చేది ఆ రోజే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ఆదిపురుష్’ రిలీజ్ కు రెడీ అవుతుండటంతో, ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది.

Adipurush: ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ కోసం దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించగా, ఈ సినిమాను హిస్టారికల్ ఎపిక్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఆదిపురుష్, రిలీజ్‌కు రెడీ అయ్యింది.

Adipurush: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఆదిపురుష్ ‘జై శ్రీరామ్’ లిరికల్ మోషన్ పోస్టర్

ఇక ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా, ఈ సినిమా నుండి ఇటీవల వరుస అప్డేట్స్‌తో చిత్ర యూనిట్ అభిమానుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేస్తోంది. అయితే, ఈ సినిమా నుండి ఇప్పుడు మరో అప్డేట్‌ను వదిలేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సరికొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Adipurush: ‘ఆదిపురుష్’లో ఆ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందట..!

మరి నిజంగానే ఆదిపురుష్ సినిమా నుండి సరికొత్త అప్డేట్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, అందాల భామ కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు