Prabhas Kalki 2898AD Movie Collections Update Full Details Here
Kalki Collections : ప్రభాస్ కల్కి సినిమా థియేటర్స్ లో భారీ హిట్ అయిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ చూపించిన విజువల్స్ కి, యాక్షన్ సీక్వెన్స్ లకు ప్రేక్షకులు మైమరిచిపోతున్నారు. ఈ సినిమా అందరికి నచ్చేసింది. దీంతో కల్కి భారీ విజయం సాధించి కలెక్షన్స్ లో కూడా దూసుకుపోతుంది. ప్రభాస్ కల్కి సినిమా మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ వసూలు చేయగా ఇప్పుడు 11 రోజులకు 900 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కల్కి ముందు, తర్వాత కూడా ఎలాంటి సినిమాలు లేకపోవడం, హిట్ టాక్ తెచ్చుకోవడం, అన్ని ఏజ్ ల వాళ్లకు నచ్చడంతో కల్కి కలెక్షన్స్ లో దూకుసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి సినిమా 1000 కోట్లకు దూసుకుపోతుంది. త్వరలోనే 1000 కోట్లని రీచ్ అవుతుంది కల్కి. ఇక కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే అనేక చోట్ల చాలా రికార్డులు సెట్ చేసింది కల్కి.
Also Read : Manchu Manoj Daughter : మంచు మనోజ్ కూతురు పేరేంటో తెలుసా..? బారసాల ఫోటో వైరల్.. బాహుబలిలోని ఆ పేరుని..
అమెరికాలో 16 మిలియన్ డాలర్స్ పైగా కలెక్టు చేసి దూసుకుపోతుంది. హిందీలో కూడా ఏకంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇలా అన్ని చోట్ల ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అయి సినిమా ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. కల్కి థియేట్రికల్ బిజినెస్ 370 కోట్లు జరిగినట్టు సమాచారం. అంటే షేర్ కనీసం 380 కోట్లు వచ్చినా హిట్ అయినట్టే. ఇప్పుడు 900 కోట్ల గ్రాస్ అంటే ఆల్మోస్ట్ 450 కోట్ల షేర్ రాబట్టి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది. వెయ్యి కోట్లు ఎప్పుడు చేరుతుందా ప్రభాస్ ఇంకో సరికొత్త రికార్డ్ ఎప్పుడు సెట్ చేస్తాడా అని అభిమనులు ఎదురుచూస్తున్నారు.
Raging towards the magical milestone…❤️?#EpicBlockbusterKalki in cinemas – https://t.co/z9EmiReie8#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/Jyf1bAamUu
— Kalki 2898 AD (@Kalki2898AD) July 8, 2024