Anna Ben : ‘కల్కి’ షూటింగ్‌లో గాయాల పాలైన నటి.. ఫోటోలు షేర్ చేసి..

తాజాగా అన్నా బెన్ కల్కి సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసింది. యాక్షన్ సీక్వెన్స్ లో తనకి ఒంటి మీద పలు చోట్ల తగిలిన దెబ్బలు కూడా ఫోటోలు తీసి పోస్ట్ చేసింది.

Anna Ben Injured in Prabhas Kalki 2898AD Movie while shooting Action Sequences Photos goes Viral

Anna Ben : ప్రభాస్ కల్కి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులందర్నీ మెప్పిస్తుంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. కల్కి సినిమాలో మలయాళం హీరోయిన్ అన్నాబెన్ కూడా నటించింది.

మలయాళం నటి అన్నా బెన్ కల్కి సినిమాలో కైరా పాత్రలో కనిపించి మెప్పించింది. ఒక అరగంట సేపే కనపడినా తన పాత్రతో ప్రేక్షకులని మెప్పించింది. క్యూట్ గా మాట్లాడుతూనే యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది. దీంతో కైరా పాత్ర బాగానే పాపులర్ అయింది. ఇప్పటికే కల్కి లాంటి భారీ సినిమాలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు అన్నా బెన్ థ్యాంక్స్ చెప్పింది. కల్కి సినిమా గురించి పలు పోస్టులు పెట్టింది.

Also Read : SJ Suryah – Pawan Kalyan : నా ఫ్రెండ్ డిప్యూటీ చీఫ్ మినిష్టర్ పవన్ కళ్యాణ్.. సీఎంగా మీరే చేయాలి..

తాజాగా అన్నా బెన్ కల్కి సినిమా గురించి స్పెషల్ పోస్ట్ చేసింది. కొన్ని వర్కింగ్ స్టిల్స్, కొన్ని తన గెటప్ ఫొటోస్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ లో తనకి ఒంటి మీద పలు చోట్ల తగిలిన దెబ్బలు కూడా ఫోటోలు తీసి పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆ గాయాలు చూసి పాపం కల్కి సినిమా కోసం అన్నా బెన్ బాగానే కష్టపడింది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలు షేర్ చేస్తూ అన్నా బెన్.. కైరా పాత్ర రెండేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సంతోషించి ఒక కొత్త పాత్ర చేయబోతున్నాను అని ఓకే చెప్పాను. ఈ పాత్ర నా కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని భావించాను. నాగ్ అశ్విన్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇంత పెద్ద ఇండియన్ సినిమాలో నన్ను భాగం చేసినందుకు. నాగి సర్ కి ఎంత వర్క్ ఉన్నా రిలాక్స్ గా ఉంటారు. ఆయన నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేశారు. ఆయనతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా ఉంది. ఇండియన్ సినిమాలో కైరా పాత్ర నిలిచిపోయినందుకు ధన్యవాదాలు. ఈ షూటింగ్ సమయంలో ఎంతోమంది మంచివాళ్ళని, గొప్పవాళ్ళని కలిసాను. కైరా పాత్రకు మీరంతా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేను మరింత ఎక్కువగా కష్టపడతాను అని తెలిపింది.