Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రివ్యూ.. పవన్ హరీష్ కాంబో సినిమా ఎలా ఉంది..? పవర్ స్టార్ హిట్ కొట్టాడా?
సినిమా అంతా కూడా పవన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. (Ustaad Bhagat Singh)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కింది. రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల అయింది.
కథ విషయానికొస్తే..
సీఎం(KS రవికుమార్) ఓ పెళ్ళికి వెళ్తే అతనిపై దాడి జరగడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుంటాడు. దాంతో నల్ల నాగప్ప(పార్తీబన్) అందర్నీ బెదిరించి ఆపద్ధర్మ సీఎం అవుతాడు. నాగప్ప కొడుకు(కిల్లి క్రాంతి) ఫ్రెండ్స్ తో కలిసి ఓ అడవిలోకి పార్టీకి వెళ్తాడు. వీళ్ళ గంజాయి పట్టుకున్నాడని పోలీసుల మీదకు గొడవకు వెళ్లడంతో ఉస్తాద్ భగత్ సింగ్(పవన్ కళ్యాణ్) అందర్నీ చంపి నాగప్ప కొడుకుని తీసుకెళ్తాడు. దీంతో నాగప్ప, అతని మనుషులు, టెర్రరిస్టులు వెతకడం మొదలుపెడతారు.
అదే సమయంలో శ్లోక(రాశీఖన్నా) తన ఫ్యామిలీతో అడివికి రావడంతో వీళ్లకు భద్రతగా ఉస్తాద్ ఉంటాడు. శ్లోకని కిడ్నాప్ చేసి ఉస్తాద్ ని రప్పిస్తారు నాగప్ప మనుషులు. అసలు నాగప్పకి – ఉస్తాద్ కి ఉన్న గొడవ ఏంటి? సీఎంపై దాడి చేసింది ఎవరు? సీఎంకి ఉస్తాద్ కి ఉన్న సంబంధం ఏంటి? ఉస్తాద్ జీవితంలో లీల(శ్రీలీల) పాత్రేంటి, టెర్రరిస్టులకు, నాగప్పకు ఉన్న లింక్ ఏంటి?.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, నెటిజన్లు ఏమంటున్నారు..?
సినిమా విశ్లేషణ..
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ దర్శకత్వంలో సినిమా అనడంతో మొదట భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా లేట్ అవ్వడం, హరీష్ ట్విట్టర్లో తన ట్వీట్స్ తో వైరల్ అవ్వడం, తేరి రీమేక్ అనడం, సాంగ్స్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయకపోవడంతో సినిమాపై ఆసక్తి తగ్గింది. కానీ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై మళ్ళీ అంచనాలు నెలకొన్నాయి.
ఫస్ట్ హాఫ్ సింపుల్ గా పాత్రల పరిచయం, ఉస్తాద్ చిన్నప్పటి స్టోరీ, నాగప్ప కొడుకు అడివికి రావడం ఉస్తాద్ కి చిక్కడంతో ఓ రెండు సీన్స్ ఓ రెండు ఫైట్స్ అన్నట్టు సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు ఓ ట్విస్ట్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ మొదలుపెట్టి నాగప్ప – ఉస్తాద్ మధ్య వైరం ఉన్నట్టు చూపిస్తారు. దీంతో ఆ వైరం ఏంటో తెలుసుకోవాలని సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ బాగా సాగదీశారు. పెద్దగా కథేం లేకుండా సీన్స్ తో నడిపించారు. సెకండ్ హాఫ్ మాత్రం బాగుంటుంది. అసలు ఉస్తాద్ ఎవరు, నాగప్పతో ఉన్న వైరం ఏంటి, లీల ఉస్తాద్ సీన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లు బాగుంటాయి.
సెకండ్ హాఫ్ లో తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే సాంగ్ ని రీమిక్స్ చేసారు. సినిమాకు ఈ సాంగ్, ఈ సాంగ్ లో శ్రీలీల – పవన్ మధ్య వచ్చే లవ్ సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఫస్ట్ హాఫ్ బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ లో పవన్ తన డ్యాన్స్ పై తనే సెటైర్లు వేసుకునే సీన్ కి నవ్వుకోవచ్చు. పంచ్ డైలాగ్స్ అయితే వరుస పెట్టి వస్తూనే ఉంటాయి. ఫ్యాన్స్ ఈ సినిమాలోని డైలాగ్స్ ఇక రెగ్యులర్ గా వాడటం ఖాయం.
ఇక తేరి రీమేక్ అనుకోని తర్వాత స్టోరీ మార్చాము అన్నారు కానీ తేరి, పటాస్.. ఇలా కొన్ని కమర్షియల్ సినిమాలను మిక్స్ చేసి కథ తీసుకున్నట్టు ఉంటుంది. చిన్న చిన్న లాజిక్స్ వదిలేసారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరకెక్కించారు. ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా సీన్స్ లో దేశభక్తి చూపించి దేశంలో జరిగే కొన్ని సంఘటనలపై కౌంటర్లు వేశారు. అయితే ఇలాంటివి కథకి అక్కర్లేకపోయినా జోడించారు. సినిమా అంతా కూడా పవన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పాత్రలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా మరోసారి మెప్పించారు. OG తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాలో కూడా పవన్ లుక్స్ బాగున్నాయి. పవన్ మరోసారి డ్యాన్స్ తో మెప్పించారు. శ్రీలీల ఈ సినిమాలో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. లవ్ సీన్స్ లో, ఎమోషన్ సీన్స్ లో బాగానే నటించింది. రాశీఖన్నా పాత్ర సింపుల్ గా ఉంటుంది.
నాగప్ప పాత్రలో నెగిటివ్ షేడ్స్ లో పార్తీబన్ చాలా బాగా నటించారు. KS రవికుమార్ మాస్టర్, సీఎం పాత్రలో మంచి మనిషిగా బాగానే మెప్పించారు. కిల్లి క్రాంతి, టెంపర్ వంశీ నెగిటివ్ పాత్రల్లో బాగానే నటించారు. పల్లవి దొర కీలక పాత్రలో మెప్పిస్తుంది. తన నటనతో కన్నీళ్లు పెట్టిస్తుంది. బిగ్ బాస్ జస్వంత్ ఓ గెస్ట్ పాత్రలో మెప్పించాడు. రావు రమేష్, గౌతమి, శ్రీనాథ్ మాగంటి, కమల్ కామరాజు, రమేష్ రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు యావరేజ్. తొలిప్రేమ ఈ మనసే సాంగ్, ఆ సాంగ్ మ్యూజిక్ మాత్రం సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యావరేజ్. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సినిమాకు సెట్స్ కోసం బాగానే కష్టపడ్డారు. హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్స్ మాత్రం చాలానే రాసారు. ఈ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం. కొన్ని కమర్షియల్ సినిమాలను మిక్స్ చేసి వాటిల్లోంచి కథ తీసుకొని మంచి స్క్రీన్ ప్లేతో ఫ్యాన్స్ ని మెప్పించేలా సినిమా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
