Gold Price Today : భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. కారణాలు ఇవే.. గోల్డ్ రేటు ఇంకా తగ్గుతుందా..? ఫుల్ డీటెయిల్స్
Gold Price Today : పశ్చిమాసియాలో ఉధ్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటు ఒక్కోరోజు పెరుగుతూ.. ఒక్కోరోజు తగ్గుతూ వస్తోంది. అయితే, గత మూడు రోజులుగా బంగారం ధర భారీగా పతనమైంది.
Gold Price Today
- బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్న్యూస్
- భారీగా పతనమైన ధరలు
- ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు
Gold Price Today : బంగారం మళ్లీ సామాన్యులకు దగ్గరవుతోందా..? నిపుణుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెల ప్రారంభం ముందు వరకు గోల్డ్ రేటు భారీగా పెరిగింది. సరికొత్త రికార్డులను నమోదు చేసింది. తులం బంగారం రూ.2లక్షల మార్కుకు చేరువైంది. అయితే, ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. గోల్డ్ రేటు భారీగా పతనమవుతోంది. పశ్చిమాసియాలో ఉధ్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటు ఒక్కోరోజు పెరుగుతూ.. ఒక్కోరోజు తగ్గుతూ వస్తోంది. అయితే, గత మూడు రోజులుగా బంగారం ధర భారీగా పతనమైంది.
ఉగాది పర్వదినం రోజున (గురువారం) గోల్డ్ రేటు ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు తులం బంగారంపై రూ.8వేలకుపైగా తగ్గింది. గురువారం రాత్రి ఔన్సు (31.10గ్రాములు) మేలిమి బంగారం ధర 282డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,608 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర సైతం భారీగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర ఐదు డాలర్లు తగ్గి 71డాలర్లకు పరిమితమైంది. దీంతో కిలో వెండి రేటు సుమారు రూ.16వేలు తగ్గింది. ప్రస్తుతం రూ.2,37,210 వద్దకు చేరింది.
బంగారం, వెండి ధరలు భారీగా పతనమవ్వడానికి పశ్చిమాసియా యుద్ధం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డాలర్ బలంగా కొనసాగితే.. ఇంకా కొంతకాలం బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుందని.. అయితే, దీర్ఘకాలంలో బంగారం మళ్లీ ఇన్వెస్ట్మెంట్గా పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి భారీ పెరుగుదలతో 24క్యారెట్ల తులం బంగారం రేటు రూ.2లక్షలకు చేరగా.. ప్రస్తుతం ఆ ధర రూ.1.50కి తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. తులం గోల్డ్ రేటు రూ.లక్షకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
