AP Movie Theaters: ఆగని అధికారుల దాడులు.. థియేటర్ల మూసివేత!

ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు, సినిమా పెద్దలు ప్రభుత్వం కోరడం.. కోర్టులకు వెళ్లడం..

AP Movie Theaters:: ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు, సినిమా పెద్దలు ప్రభుత్వం కోరడం.. కోర్టులకు వెళ్లడం.. మరోవైపు ప్రభుత్వం పెంచేది లేదని కోర్టులకు ఎక్కడం.. భారీ సినిమాలకు కొన్ని థియేటర్లు ధరలు పెంచి అమ్మడం.. అధికారులు దాడులు చేసి ఆ థియేటర్లను సీజ్ చేయడం ఇలా థియేటర్లు-టికెట్ల ధరల వ్యవహారం ఆగని సమస్యగా మారిపోయింది. ఇన్ని సమస్యల మధ్య నడిపే పరిస్థితి లేదని కొందరు థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు.

Radhe Shyam: ఫైట్స్, ఛేజింగ్స్ ఉండవు.. ముందే ప్రిపేర్ చేసిన డైరెక్టర్!

ఇప్పటికే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో పలు చోట్ల థియేటర్లను స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా థియేటర్లలు ఇలా మూసేశారని ఒక అంచనా ఉండగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఓ ప్రతిష్టాత్మక మల్టీఫ్లెక్స్ ను కూడా మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. నెల్లూరు నగరం.. సూళ్లూరు పేట జాతీయ రహదారిపై ఉన్న వి-ఎపిక్‌ థియేటర్‌ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్‌ కలిగిన ఈ థియేటర్‌లో సినిమాని ఎంజాయ్‌ చేసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం:35కి అనుగుణంగా థియేటర్లు నడపడం సాధ్యం కాదని.. అందువల్ల థియేటర్‌ని మూసివేస్తున్నామని శనివారం ఉదయం యాజమాన్యం తెలిపింది. దీంతో వీకెండ్ సినిమా చూసేందుకు కుటుంబాలతో థియేటర్‌ వద్దకు వచ్చిన సినీ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. సినిమాతో పాటు ఇక్కడ మిగతా వ్యాపారం కూడా భారీస్థాయిలో జరుగుతుంది. అలాంటిది ఇదే మూతపడితే మిగతా థియేటర్ల పరిస్థితి ఏమిటని థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు