Odisha : హీరోయిన్‌తో నడిరోడ్డుపై దొరికిపోయిన హీరో…రచ్చ చేసిన హీరో భార్య

ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది.

Odisha :  ప్రముఖ ఒడిషా హీరో బబుషాన్ మొహంతి పర్సనల్ లైఫ్ ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. తన సహ నటితో కలిసి కారులో వెళుతుండగా అతని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఇద్దరిని కొట్టినంత పని చేసింది. నడిరోడ్డుపై ఇద్దరిని నిలదీసి రచ్చరచ్చ  చేసింది.

బబుషాన్ తన సహనటి   హీరోయిన్  ప్రకృతి మిశ్రాతో కలిసి ఈరోజు భువనేశ్వర్ లో  విమానాశ్రయానికి వెళ్లేందుకు  కారులో ప్రయాణిస్తున్నాడు. అతడి భార్య తృప్తి మొహంతి వారు ప్రయాణిస్తున్న కారును అడ్డగించింది. వారిద్దరూ వివాహేతర సంబంధంలో ఉన్నారని ఆరోపిస్తూ తిట్ల దండకం మొదలెట్టింది. మొదట భర్తను కొట్టబోయింది. అనంతరం హీరోయిన్ ప్రకృతి మిశ్రాను  జుట్టు పట్టుకుని కొట్టబొయింది.

ఆమె నుంచి తప్పించుకున్న ప్రకృతి కారు దిగి అక్కడి నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించగా హీరో భార్య త్రుప్తి ఆమె వెనుక పరిగెత్తి మరీ అడ్డుకొని దాడికి ప్రయత్నించింది. తన భర్తను తనకు కాకుండా చేస్తోందని ఆమె ఆరోపించింది. కాగా బబుషాన్, ప్రకృతి జంటగా నటించిన ప్రేమమ్ సినిమా త్వరలో విడుదల కానుంది.

ట్రెండింగ్ వార్తలు