Padma Shri : రోడ్డుపై బత్తాయి పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

నారింజ పండ్లు అమ్ముకునే వ్యక్తి అక్షర మునిగా ఎలా మారాడు? రోడ్లపై పండ్లు అమ్ముకునే వ్యక్తిని పద్మశ్రీ అవార్డు ఎలా వరించింది? పేదపిల్లల అక్షరదాత పద్మ అవార్డు గ్రహీతగా మారిన గొప్పదనం

harekala hajabba received by padma shri award : పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ అవార్డు అందుకున్నాడు. పండ్లు అమ్ముకునే వ్యక్తి ఎంతోమందికి విద్యను అందించే గొప్ప పనిచేశారు. ఈ గొప్పతనానికి పద్మశ్రీయే తరలి వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఓ పండ్లు అమ్ముకునే వ్యక్తి చేతిలో మరింత గొప్పగా నిలిచింది. రోడ్ల మీద నారింజ పండ్లు అమ్ముకునే ఓ అతి సామాన్య వ్యక్తిని పద్మశ్రీ వరించిన పురస్కారం అతని గొప్ప చేతుల్లో నిలిచిన నా జన్మ ధన్యం అనుకుంది. ఆ మహోన్నత వ్యక్తే ‘హరేకల హజబ్బ’. కర్ణాటకకు చెందిన హజబ్బ మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి పండ్లు అమ్ముకుంటున్నారు. నారింజ పళ్లు అమ్ముకునే ఓ సామాన్య వ్యక్తి ఇప్పుడు యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశంలోనే అత్యున్నత నాలుగో పౌర పురస్కారమైన పద్మశ్రీని ఆయన అందుకున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా సగౌరవంగా, నిగర్వంగా పురస్కారాన్ని అందుకున్నారు.

Read more :  Padma Shri Tulasi Gowda: కాళ్లకు చెప్పులు కూడా లేని పద్మ శ్రీ అవార్డు గ్రహీత తులసీ గౌడ

అసలు 66 ఏళ్ల హజబ్బ ఇంత గొప్ప పురస్కారాన్ని ఎలా అందుకోగలిగారు? ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఆయన ఏం చేశారు? ఏమిటో తెలుసుకుందాం. హజబ్బ ఏమీ చదువుకోలేదు.సంతకం పెట్టటం కూడా రాదు. కర్ణాటకలోని మంగళూరు బస్ డిపో వద్ద 1977 నుంచి నారింజ పళ్లు అమ్ముతూ జీవిస్తున్నారు. ఎప్పుడు బడి గడప కూడా దాటలేదు. కానీ తన జీవితంలో ఎదురైన ఓ ఘటన ఆయనతో ఏకంగా ఓ స్కూలే కట్టించేలా చేసింది. అదే ఆయనను పద్మశ్రీ పురస్కారాన్ని పొందేలా చేసింది. పేద పిల్లల కోసం స్కూల్ కట్టించిన హజబ్బను పద్మశ్రీ పురస్కారం వరించింది.

హజబ్బ సొంత ఊరిలో ఓ స్కూల్ నిర్మించారు. పేదలకు విద్యను అందించాలనుకున్న ఆయన సంకల్పానికి ఓ కారణం ఉంది. ఆయన కట్టించిన స్కూల్లో 175 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న అక్షర ముని హజబ్బ. తన గురించి హజబ్బ చెబుతు..’ఒక రోజు నారింజ పండ్లు కొనటానికి ఓ విదేశీయుడు నా వద్దకు వచ్చాడు. నారింజ పళ్ల ధర ఎంతో అడిగాడు.నాకు చదువు లేదాయె. ఆయన ఏమని అడుగుతున్నాడో తెలియలేదు. దాంతో ఆయనకు నేను ఏం సమాధానం చెప్పలేకపోయాను. నాకు నా మాతృభాష కన్నడ మాత్రమే వచ్చు. ఇంగ్లీష్, హిందీ అస్సలు రావు. ఆయనకు సమాధానం కూడా చెప్పలేని నా స్థితికి నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అప్పుడే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నా. నేను ఎలాగు చదువుకోలేకపోయాను.నాలాంటి పేదల పిల్లల కోసం ఓ స్కూల్ కట్టాలని అనుకున్నాను. కానీ పండ్లు అమ్ముకుంటేనే నాకు రోజు గడుస్తుంది. చేయగలనా? అని అనుకున్నాను. కానీ కట్టాలనే ఆశ ఉంది. అలా ఆ ఆశ నెరవేర్చుకోవటానికి అప్పటి నుంచి ప్రతిరోజు నాకు వచ్చే నా సంపాదనలో కొంత మొత్తాన్ని ఆదా చేయడం ప్రారంభించాను’ అలా కొంతకానికి నా ఆశ నెరవేరింది. పేద పిల్లల కోసం ఓ బడి కట్టగలిగాను అని చెప్పుకొచ్చారు.

Read more : PV Sindhu Padma Bhushan : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా..ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

హజబ్బ కల నెరవేరటానికి 20 ఏళ్లు పట్టింది. తన స్వగ్రామమైన హరెకాల-నీపాడ్పు గ్రామంలో ఆయన స్కూల్ నిర్మించారు. 2001 జూన్‌ నాటికి ప్రభుత్వం, దాతల సాయంతో 8 తరగతి గదులు, రెండు మరుగుదొడ్లతో స్కూలు నిర్మాణం పూర్తి చేశాడు. ఆ తర్వాత నుంచి హై స్కూల్ ను కూడా పూర్తి చేసి ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం 175 మంది పేద విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్య కోసం ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. విద్యను అందించడం కోసం ఎంతో తపన పడిన ఆయనకు స్థానికంగా ఎంతో గౌరవం ఉంది. ఆయనను స్థానికులు వారు ‘అక్షర ముని’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కానీ ఈ అక్షర ముని ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపి 2020 సంవత్సారినికి గాను ఆయనను పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది ప్రభుత్వం. పద్మశ్రీని అందుకుని యావత్ భారతమే ఎవరీ అక్షర ముని అని తెలుసుకునేలా చేసింది.

Read more : చీకటిని గెలిచిన యామిని : చదువు కోసం అంతులేని వివక్షను జయించి గిరిజన యువతి

హజబ్బ నిర్మించిన స్కూల్ 28 విద్యార్థులతో ప్రారంభమైంది. ఇప్పుడు 175 మంది విద్యార్థులకు విద్యను అందిస్తోంది. 10వ తరగతి వరకు జరుగుతోంది. వివిధ అవార్డుల ద్వారా తనకు వచ్చిన డబ్బును విద్యాలయాల నిర్మాణాలకే ఉపయోగిస్తానంటున్నాడీ అక్షర ముని. తన గ్రామంలో మరిన్ని స్కూళ్లు, కాలేజీలను నిర్మించాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఎంతో మంది వారి వంతుగా ఆర్థికసాయం చేశారని… వారి డబ్బుతో పాటు, తనకు వచ్చిన డబ్బుతో విద్యాలయాల కోసం స్థలాన్ని కొన్నానని తెలిపారు.తన గ్రామంలో ప్రీ యూనివర్శిటీ (ఇంటర్) కాలేజీని నిర్మించాలని ప్రధాని మోదీని కోరానని హజబ్బ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు