Making Vermicompost : పంటల పాలిట కల్పతరువుగా సేంద్రియ ఎరువులు.. వర్మీకంపోస్ట్ తయారితో స్వయం ఉపాధి

వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు.

Making Vermicompost : అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలోభూములు సారాన్ని కోల్పోయి నిర్జీవం అవుతున్నాయి.  వస్తున్న దిగుబడులకన్నా, వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులను తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి.

READ ALSO : Organic Fertilizers : వ్యవసాయంలో సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులతోపాటు, ఖర్చులు తక్కువే!

సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీకంపోస్ట్. ఈ వర్మికంపోస్ట్ ను 30 ఏళ్లుగా తయారు చేస్తూ.. స్వయం ఉపాధిని ఏర్పరుచుకున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.

రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు… భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూ భౌతిక లక్షణాలు కనుమరుగవడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి.

READ ALSO : Grapes : సేంద్రీయ పద్థితిలో ద్రాక్ష సాగుకు అనువైన నేలలు, వాతావరణం

ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీనిని ముందుగానే పసిగట్టిన ఏలూరు జల్లా, నూజివీడు మండలం, లీలానగర్ కు చెందిన రైతు వర ప్రసాద్ 30 ఏళ్లుగా హరిత వర్మికంపోస్ట్ పేరుతో  వర్మీకంపోస్ట్ తయారుచేసి అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఇదిగో ఇక్కడ చూడండీ వరుసగా షెడ్లు కనిపిస్తున్నాయి. ఇవేవో పాకలు అనుకోకండి. ఇందులో వర్మికంపోస్ట్ తయారవుతుంది. సాధారణంగా గుంతల్లో తయారుచేసే కంపోస్టు.. వినియోగంలోకి రావటానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం  పడుతుంది. కానీ కేవలం నెల రోజుల్లో  వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రీయ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మపోషకాల లభ్యత ఎక్కువ వుంటుంది.

READ ALSO : Sandalwood Cultivation : శ్రీగంధం సాగుతో… అధిక అదాయం

మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషాకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈపోషకాలన్నీ ఒకేచోట లభ్యమయ్యే వర్మీకంపోస్టు వంటి సేంద్రీయ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు  సూచిస్తున్నారు.

దీంతో డిమాండ్ నానాటికీ పెరుగుతుండటంతో కొంతమంది వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్థుతం కిలో వర్మీ కంపోస్టు 10 రూపాయల వరకు ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్ తో పట్టణాల్లో కిలో 20నుండి 25 రూపాయలకు కూడా అమ్ముతున్నారు.

READ ALSO : Convert fallow lands : చౌడు భూముల పునరుద్ధరణ.. జిప్సమ్, పచ్చిరొట్ట ఎరువులతో చౌడు నివారణ

వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లు వరకు వివిధ పంటకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడంవల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి రెండు సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక  దిగుబడి పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు