Karnataka: బెళగావికి చేరిన లింగాయత్‭ల ఆందోళన.. బీజేపీతో ఢీ అంటే ఢీ

లింగాయత్ సామాజిక వర్గం వెనుకబడిన కులమని, రిజర్వేషన్లు కల్పించి తమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని లింగాయత్ ఆందోళనలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రస్తుతం బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా.. లక్షల మంది నిరసనగా బెళగావికి గురువారం ఉదయమే పాదయాత్ర ప్రారంభించి, మద్యాహ్నం నాటికి సువర్ణ సౌధకు చేరుకున్నారు

Karnataka: ఇప్పటికే విపక్ష కాంగ్రెస్ పార్టీతో వేగలేక నెట్టుకొస్తున్న కర్ణాటక ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి బయటి నుంచి వచ్చే అనేక సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆ పార్టీ భారీ ఓటు బ్యాంకుగా ఉన్న పంచమసలి లింగాయత్‌‭లు తిరగబడ్డారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగ, విద్యా అవకాశాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళన ర్యాలి గురువారం బెళగావిలోని సువర్ణ విధాన సౌధకు చేరుకుంది. తమకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వల్లే యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం పతనమైందని, ఇలాగే తాత్సారం చేస్తే బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం సైతం కూలుతుందని హెచ్చరిస్తున్నారు.

BRS Protest: రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆందోళనలు.. పిలుపునిచ్చిన మంత్రి కేటీఆర్

మృత్యునయ స్వామి సారథ్యంలో సుమారు 2 లక్షల మంది పంచమసలి లింగాయత్‌లు బెళగావికి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిరసనకారులు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా గురువారం మీడియాతో మృత్యునయ మీడియాతో మాట్లాడుతూ ‘‘కర్ణాటకలో మా జనాభా 1.3 కోట్లు. లింగాయత్‌లలో మేము చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాము. బీజేపీ ఓటు బ్యాంకులో మా వాటా 80 శాతం. ప్రస్తుత ప్రభుత్వంలో 22 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. గతంలో యడియూరప్ప ప్రభుత్వం మాకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. అందుకే పతనమైంది. ఇప్పుడు బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం కూడా మాకు రిజర్వేషన్ హామీ ఇచ్చింది. ఒకవేళ అది జరక్కపోతే, దాని ఫలితం 2023లో చూడాల్సి ఉంటుంది’’ అని అన్నారు.

Parliament: పార్లమెంటులో మళ్ళీ మాస్కులు పెట్టుకుని కనపడ్డ ఓం బిర్లా, ధన్‌కర్, మోదీ

లింగాయత్ సామాజిక వర్గం వెనుకబడిన కులమని, రిజర్వేషన్లు కల్పించి తమకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని లింగాయత్ ఆందోళనలో పాల్గొన్న నాయకులు తెలిపారు. ప్రస్తుతం బెళగావిలో కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా.. లక్షల మంది నిరసనగా బెళగావికి గురువారం ఉదయమే పాదయాత్ర ప్రారంభించి, మద్యాహ్నం నాటికి సువర్ణ సౌధకు చేరుకున్నారు. అయితే, ఈ సమస్యపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ గురువారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంచమసలి లింగాయత్‌లకు రిజర్వేషన్లు కల్పించడంపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు