Pawan Klayan : మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్రేక్ ఇస్తారా??

వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌.. వరుస హిట్లతో ఫ్యాన్స్ లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరసబెట్టి సినిమాలు కమిట్ అయ్యి ఫుల్ కిక్ ఇచ్చారు. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్‌......................

Pawan Klayan :  పాలిటిక్స్, మూవీస్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్, భీమ్లానాయక్ వరుసగా రెండు హిట్స్ రావడంతో పవన్ లోనూ ఎనర్జీ రెట్టింపైంది. ప్రొడ్యూసర్స్ కూడా వన్ బై వన్ అడ్వాన్సులు ఇచ్చేశారు. డైరెక్టర్స్ ఫిక్సయ్యారు. కాస్టింగ్ సెలక్షన్ చేసేశారు, స్టోరీలు రెడీ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అందర్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా కంప్లీట్ అవుతుందా లేదా? అని కొంతమంది భయపడుతుంటే అసలు ఫస్ట్‌ క్లాప్‌ అన్నా పడుతుందా? అన్న డౌట్‌ మరికొంతమందిలో ఉంది.

వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌.. వరుస హిట్లతో ఫ్యాన్స్ లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్. ఆ తర్వాత వరసబెట్టి సినిమాలు కమిట్ అయ్యి ఫుల్ కిక్ ఇచ్చారు. ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్‌ జరుగుతోంది. ఆ తర్వాత సముద్రఖని డైరెక్షన్‌లో వినోదయ సీతమ్ రీమేక్‌లో పవన్ నటిస్తారని టాక్ వినిపించింది. దాని తర్వాత హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్‌, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తాళ్లూరి రామ్ నిర్మించే సినిమాలో నటిస్తారని వచ్చే ఎన్నికలకు ముందే ఈ సినిమాలను కంప్లీట్ చేస్తారని మేకర్స్ అనుకున్నారు. కానీ, పరిస్థితులు చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ మాత్రమే ఉంది. అక్టోబర్ 5 నుంచే జనసేనాని జనంలోకి వెళ్తుండడంతో దాని ఎఫెక్ట్ సినిమాల మీద పడుతుందోన్న భయం నిర్మాతల్లో మొదలయ్యింది.

ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు షూటింగ్ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కారణంగా నత్తనడకన సాగింది. ఓ దశలో ఈ సినిమా ఆగిపోయిందని రూమర్ క్రియేట్ అయ్యింది. దాంతో డైరెక్టర్ క్రిష్ రంగంలోకి దిగి ఆగిపోలేదని పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 10 నుంచి మే 20 వరకు బాచుపల్లిలో వేసిన సెట్ లో షూటింగ్ జరిగింది. మొత్తానికి 50 పర్సెంట్ షూట్ కంప్లీట్ చేసుకుంది హరిహర వీరమల్లు. కాని, ఆతర్వాత కౌలు రైతు భరోసా యాత్ర, పార్టీ సమావేశాలని పవన్ పర్యటిస్తుండటంతో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల వేడి మొదలవడంతో అక్టోబర్ 5 నుంచే పొలిటికల్ టూర్ కి ప్లాన్ చేసుకున్నారు జనసేనాని.

Thaman-Devisri Prasad : మ్యూజిక్ డైరెక్టర్స్ పై వరుస ట్రోల్స్.. ఇకనైనా మారుతారా??

భవదీయుడు భగత్‌సింగ్‌ కమిట్ అయ్యి చాలా రోజులు అయింది. ఈ సినిమా ఆరు నెలల క్రితమే మొదలు కావాల్సింది. అసలు ఉంటుందా ఉండదా అని టాక్ కూడా నడిచింది. లేటెస్ట్ గా అంటే సుందరానికి ప్రీరిలీజ్ వేడుకలో మరోసారి ఈ సినిమా ఉంటుందని పవన్ తోనే క్లారిటీ ఇప్పించారు మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్. హరీశ్ శంకర్ కూడా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూసి, డైలాగ్స్ చెప్పుకునేలా ఉంటాయని ప్రామిస్ చేశారు. కాని, ఇప్పటి వరకు ఇంకా క్యాస్టింగ్ సెలక్షన్ కూడా జరగలేదు. సముద్రఖని డైరెక్షన్ లో వినోదయ సీతం రీమేక్ పరిస్థితి కూడా అంతే. ఏప్రిల్ నుంచే సెట్స్ మీదకు వెళ్తుందన్నారు కాని కుదరలేదు. ఇక సురేందర్‌రెడ్డితో సినిమా అయితే ఇంకా అఫిషియల్ గా అనౌన్సే కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీ అయిపోతే, హరిహర వీరమల్లు మినహాయించి అన్ని సినిమాలూ వాయిదా పడే ప్రమాదం ఉందని టెన్షన్ పడిపోతున్నారు నిర్మాతలు.

దీంతో మళ్ళీ సినిమాలకి పవన్ బ్రేక్ ఇవ్వనున్నారని టాక్ నడుస్తుంది. ఒకవేళ అన్ని బాగుండి పవన్ సీఎం అయితే ఇక సినిమాలు అటకెక్కినట్టే. పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ట్రెండింగ్ వార్తలు