Plant Protection In Papaya : బొప్పాయి నారుమడుల్లో చీడపీడల గండం.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు

బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా వుంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గుచూపుతున్నారు . ఆగష్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు.

Plant Protection In Papaya

Plant Protection In Papaya : మెట్టప్రాంతాల్లోని రైతులకు బొప్పాయి సాగు లాభసాటిగా మారింది . బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో నానాటికీ వినియోగం పెరుగుతోంది. దీంతో పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా వుంది. అధిక విస్తీర్ణంలో సాగుకు మొగ్గుచూపుతున్నారు . ఆగష్టులో మొక్కలు నాటేందుకు కొంతమంది రైతులు నారు మొక్కలు పెంచుతున్నారు. అయితే పిండినల్లి, నారుకుళ్ళు ఆశించటం వల్ల మొక్కలు చనిపోతున్నాయి. . వీటి నివారణకు సరైన యాజమాన్య చర్యలను చేపడితే నాణ్యమైన నారు అంది వస్తుందని తెలియజేస్తున్నారు  వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా బంతి సాగు

మన దేశంలో బొప్పాయి సాగు విస్తీర్ణం లక్షా అరవై వేల హెక్టార్లలో సాగవుతోంది.  57 మెట్రిక్ టన్నుల  ఉత్పత్తి జరుగుతోంది. విస్తీర్ణం, దిగుబడిలో ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది. బొప్పాయి అధికంగా పండించే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా ముఖ్యమైనవి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో సాగవుతోంది.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

వేసవిలో తప్ప ఎప్పుడైనా నాటుకునే అవకాశం వుంది. ఖరీఫ్ లో బొప్పాయి నాటే రైతాంగం ప్రస్థుతం నారు పెంచే పనిలో వున్నారు. అయితే చాలా చోట్ల నారుమడుల్లో పిండినల్లి, నారుకుళ్ల ఉధృతిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డా. జే. హేమంత్ కుమార్.

READ ALSO : Papaya Cultivation Techniques : బొప్పాయిలో చీడపీడల బెడద – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

నారుకుళ్లు తెగులు నర్సరీలో ఎక్కువ నష్టాన్ని కలుగచేస్తుంది. మొదలు మెత్తగా మారి, వేర్లు కుళ్ళిపోతాయి. కాయలున్న చెట్లకు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. ఒక సంవత్సరం వయసున్న చెట్లకంటే ఒక వారం వయస్సున్ననారు మొక్కలు ఈ తెగులుకు సులువుగా లోనవుతాయి. పంట ఏ దశలోనైనా ఈ తెగులు ఆశించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు