Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా బంతి సాగు

గత ఏడాది జులైలో ఎకరంలో ప్రయోగాత్మకంగా బెడ్ల విధానంలో తైవాన్ రెడ్ లేడి రకం బొప్పాయి మొక్కలను నాటారు. మొక్కల మధ్య కాళీస్థలం ఉండటం.. పంట దిగుబడి రావడానికి కూడా 7 నెలల సమయం ఉండటంతో అంతర పంటగా బంతిపూలను నాటారు. బంతిని నాటిన 45 రోజుల నుండి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం బంతి చివరి దశకు చేరుకుంది.

Intercrop In Papaya

Intercrop In Papaya : రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు బొప్పాయిలో అంతర పంటగా బంతి సాగుచేపట్టి మంచి దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగానే అమ్ముతూ.. అదనపు లాభాలను ఆర్జిస్తున్నారు.

READ ALSO : Black Thrips Pest : మామిడి, బొప్పాయితో పాటు ఇతర ఉద్యానవన తోటల్లో నలుపు రంగు తామర పురుగుల నియంత్రణ!

పశ్చిమగోదావరి జిల్లా, తాడెపల్లి గూడెం మండలం, జగ్గన్నపేట గ్రామానికి చెందిన  రైతు బొట్ట నరసింహారావు. తనకున్న 3 ఎకరాల్లో వరిసాగుచేసేవారు. అయితే పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా దిగుబడులు రాకపోవడం.. ఇటు వచ్చిన దిగుబడులకు మార్కెట్ లో ధర పలకపోవడంతో.. పంట మార్పిడి చేశారు.

గత ఏడాది జులైలో ఎకరంలో ప్రయోగాత్మకంగా బెడ్ల విధానంలో తైవాన్ రెడ్ లేడి రకం బొప్పాయి మొక్కలను నాటారు. మొక్కల మధ్య కాళీస్థలం ఉండటం.. పంట దిగుబడి రావడానికి కూడా 7 నెలల సమయం ఉండటంతో అంతర పంటగా బంతిపూలను నాటారు. బంతిని నాటిన 45 రోజుల నుండి దిగుబడి ప్రారంభమైంది. ప్రస్తుతం బంతి చివరి దశకు చేరుకుంది.

READ ALSO : Pindinalli : దానిమ్మ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు నష్టం కలిగిస్తున్న పిండినల్లి! నివారణ చర్యలు

బొప్పాయి, బంతి మొక్కలకు డ్రిప్ ద్వారానే నీటితడులు, ఎరువులను అందించారు రైతు నరసింహారావు. ప్రస్తుతం బొప్పాయి పంట పూత , పిందె దశలో ఉంది. పూలపై వచ్చిన ఆదాయం ఇంటి ఖర్చులతో పాటు.. ప్రధాన పంట అయిన బొప్పాయి పెట్టుబడులకు కాగా.. ఇప్పుడు బొప్పాయి పంటపై వచ్చే ఆదాయం మొత్తం నికర ఆదాయమే అంటున్నారు రైతు.

ట్రెండింగ్ వార్తలు