Pests in Rice : వరిపంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న తెగుళ్లు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..

Pests in Rice : తెలుగు రాష్ట్రాల్లో వరి పిలకదశ నుండి ఈనిక దశకు చేరుకునే సమయంలో వాతావరణ పరిస్థితుల కారణంగా , వివిధ రకాల చీడపీడలు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా  అగ్గి తెగులు, కాండంకుళ్లు తెగులు, మానికాయ తెగులు  ఎక్కువగా ఆశించి నష్టం కలగజేస్తున్నాయి.  వీటిని రైతులు సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతొలుచు పురుగు, సుడిదోమ ఉధృతి… నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల తెగుళ్లు వరిపైరుకు ఆశింస్తున్నాయి. చాలా చోట్ల అగ్గితెగులు, కాండంకుళ్లు, మానికాయ తెగులు  ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడటం వల్లకూడా అగ్గితెగులు ఆశిస్తుంది.

READ ALSO : Fire Blight : యాసంగి వరిలో అగ్గితెగులు నివారణ చర్యలు!

ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలుకండె ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉదృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకిదశలో వెన్నులో మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది..

READ ALSO : Irrigation Method In Paddy : వరిలో ఆరుతడి నీటి పారుదల పద్ధతితో సాగునీటి ఆదా!

ఈ తెగుళ్ల నివారణకు రైతులు ఎంలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాంభద్రరాజు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో లింక్ పై క్లిక్ చేయండి.

ట్రెండింగ్ వార్తలు