Fuel Prices Today : బాదుడుకు బ్రేక్.. 3 రోజులుగా మారని పెట్రోల్, డీజల్ ధరలు

Fuel Prices Today : దేశవ్యాప్తంగా వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంధన ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. స్థిరంగా కొనసాగుతున్నాయి.

Fuel Prices Today : దేశవ్యాప్తంగా వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇంధన ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. స్థిరంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9 (శనివారం) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీయ ఇంధన ధరలు నిలకడగా కొనసాగడం వరుసగా మూడో రోజు. వాహనదారులకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ నెలలో పెట్రోల్, డీజల్ రేట్లు లీటరుకు రూ.3.6 వరకు పెరిగింది. గత నెలలో ఇంధన రేట్లు రూ.6.4 మేర పెరిగాయి.

హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే.. పెట్రోల్ లీటర్ ధర రూ.119.47 ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ.105.47 వద్ద ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా (బుధవారం) లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. 16 రోజుల్లో మొత్తం ధరలు లీటరుకు రూ. 10కి పెరిగాయి. రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.105.41 కాగా, డీజిల్ ధర రూ. 96.67 పెరిగింది. గురుగ్రామ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.86, లీటర్ డీజిల్ రూ. 97.10గా పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.

మార్చి 22న ఇంధన రేట్ల సవరించగా.. నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత 18 రోజుల్లో ధరలలో 14సార్లు పెరిగాయి. ముంబైలో, లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ. 120.51, డీజిల్ లీటర్ రూ. 104.77గా ఉన్నాయి. చెన్నైలో, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 110.85, రూ. 100.94 వద్ద ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 115.12, డీజిల్ ధర రూ. 99.83గా ఉన్నాయి. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.09 ఉండగా, లీటర్ డీజిల్ రూ. 94.79గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 5 రోజుల పాటు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి.

మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, తమిళనాడు, కేరళలో పలు చోట్ల డీజిల్ ఆ స్థాయి కంటే ఎక్కువగా పెరిగాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 100 దాటాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ సరఫరా తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also : petrol, diesel price today :ఇంధన ధరల దూకుడుకు బ్రేక్.. గుంటూరులో మినహా..

ట్రెండింగ్ వార్తలు