Odisha Congress : విద్యార్థులపై విరిగిన లాఠీ..వెంబడించి మరీ కొట్టారు

దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. విద్యార్థులపై లాఠీ చార్జ్‌ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.

Odisha Chatra Congress : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఎన్‌ఎస్‌యుఐ (NSUI) చేపట్టిన ఆందోళన రణరంగంమైంది. దొరికిన వారిని దొరికినట్టు చితక్కొట్టారు పోలీసులు. పరుగులు పెడుతున్న వారిని వెంబడించి మరీ కొట్టారు. వద్దని వేడుకున్నా వినలేదు. ఎన్‌ఎస్‌యుఐ నేతలపై ప్రతాపం చూపారు. లాఠీలను ఝళిపించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read More : Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ ఎన్‌ఎస్‌యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు, విద్యార్థులు భారీగా భువనేశ్వర్‌కు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని… తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. పోలీసుల మాటను పట్టించుకోలేదు ఆందోళనకారులు. అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. బారీకేడ్లను దాటుకుని వెళ్తున్న ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలపై దొరకబుచ్చుకున్నారు.

Read More : TTD Board Meeting : టీటీడీ పాలక మండలి కీలక సమావేశం.. 55 అంశాలపై చర్చ

దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. విద్యార్థులపై లాఠీ చార్జ్‌ చేశారు. ఈ లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. మరికొంత మంది స్పృహతప్పి పడిపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలపై పోలీసుల దాడిని నిరసిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టారు. శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జీ చేయడమేంటని ప్రశ్నించారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు