Assembly Elections : వచ్చే వారమే..5 రాష్ట్రాల ఎన్నికల తేదీలపై ఈసీ ప్రకటన!

త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.

Assembly Elections :  త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధిచి పోలింగ్ తేదీలను జనవరి10-13 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

తాజా రిపోర్ట్స్ ప్రకారం..అసెంబ్లీ ఎన్నికలను తూర్పు యూపీ నుంచి ప్రారంభించాలని బీజేపీ..ఎన్నికల సంఘాన్ని కోరింది. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు,ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటం, త్వరలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో ఎన్నికల సంఘానికి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాములాంటిదే.

అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల వాయిదా లేదని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అవసరమైతే పోలింగ్ గడువును మరో గంటపాటు పెంచాలని ఈసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత కొద్ది వారాలుగా ఎన్నికల కమిషన్..ఎన్నికలు జరుగనున్న 5 రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఎన్నికల సంసిద్ధతను స్వయంగా సమీక్షించడం ప్రారంభించింది.

ఇక, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు భారత ఎన్నికల కమిషన్ సోమవారం లేఖ రాసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను  లేఖలో ఈసీ కోరింది. మణిపూర్‌లో వ్యాక్సినేషన్ తొలి డోసు తీసుకున్న వారి శాతం చాలా తక్కువగా ఉండటం పట్ల ఎన్నికల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలోగా ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి ముగియనుండటంతో దీనికి ముందే కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని మరికొన్ని పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఇటీవల కేంద్రానికి సూచించిన ఎన్నికల కమిషన్ తాజాగా ఇదే విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను తాజా లేఖలో ఈసీ కోరింది.

ALSO READ US Covid Cases : అమెరికాలో కోవిడ్ సునామీ..ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు

 

ట్రెండింగ్ వార్తలు