Prabhas 25 : టైటిల్ ఏంటి డార్లింగ్.. నోరు తిరగడం లేదు..

రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా పేరు పలకడం కష్టంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

Prabhas 25: సినిమా ఇండస్ట్రీలో క్రేజ్, స్టార్‌డమ్ వచ్చే వరకు కష్టపడడం అనేది ఒకెత్తు అయితే.. ఆ ప్లేస్‌ని రీ ప్లేస్ కాకుండా.. తగ్గకుండా చూసుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. డార్లింగ్ ప్రభాస్ ‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పాన్ వరల్డ్ స్థాయి సినిమాలు లైన్లో పెడుతున్నారు.

Gopichand : ఫ్రెండ్ సినిమా కోసం ప్రభాస్..

తర్వాత వచ్చిన ‘సాహో’ టాక్ యావరేజ్ అయినా కలెక్షన్స్ మాత్రం సాలిడ్‌గా వచ్చాయంటే అది ప్రభాస్‌కున్న మార్కెట్ వల్లే. కానీ ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో వేల కోట్ల బిజినెస్‌తో.. మన టాలీవుడ్‌లో అంతెందుకు సౌత్‌లో ఎవరికీ సాధ్యం కానీ క్రేజ్ తెచ్చుకున్నారు.

Prabhas : ‘డార్లింగ్, మనోళ్లు ఎక్స్‌ట్రా ఇస్తామంటున్నారు’.. అదీ ప్రభాస్ గొప్పదనం

ఇటీవలే ‘రాధే శ్యామ్’ కి గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం బాంబేలో జరుగుతున్న ‘ఆదిపురుష్’ షూట్‌లో పాల్గొంటున్నారు. ‘సలార్’ కూడా కొంత పోర్షన్ కంప్లీట్ అయ్యింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ‘ప్రాజెక్ట్ – K’ (వర్కింగ్ టైటిల్) కూడా స్టార్ట్ అయిపోయింది.

Prabhas : ‘ప్రాజెక్ట్ – కె’.. టైటిల్ అందులోనే ఉందంటగా..!

తన కెరీర్‌లో ప్రత్యేకమైన 25వ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో.. ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో చెయ్యబోతున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడ్ మైథాలజీ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే ఈ మూవీ కోసం ‘వృందావన’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
‘బృందావనం’ అని పలకడమే కష్టం అనుకుంటే ఈ ‘వృందావన’ ఏంటి డార్లింగ్.. నోరు తిరగడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Radhe Shyam : సంక్రాంతికి ‘రాధే శ్యామ్’.. ‘వర్షం’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా..?

 

ట్రెండింగ్ వార్తలు