Prabhas : బర్త్‌డే సర్‌ప్రైజెస్ వచ్చేస్తున్నాయ్ డార్లింగ్స్..

తన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వబోతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas: రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు సాలిడ్ బర్త్‌డే ట్రీట్ రెడీ చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా ఆరు సినిమాల అప్‌డేట్స్‌తో మూవీ లవర్స్‌ను సర్‌ప్రైజ్ చెయ్యబోతున్నారు.

Mahesh Koneru : మహేష్ కోనేరు ఇకలేరు

డార్లింగ్ వరుసగా సినిమాలు లైనప్ చేస్తూ.. టాలీవుడ్ టు బాలీవుడ్ యమా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘రాధే శ్యామ్’ వచ్చే సంక్రాంతికి రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-K’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. రీసెంట్‌గా 25వ సినిమా ‘స్పిరిట్’ ను సందీప్ రెడ్డి వంగా దర్శక్తవంలో చెయ్యబోతున్నట్లు ప్రకటించారు.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా 22 నుంచే అప్‌డేట్స్‌తో హంగామా చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు మేకర్స్. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ‘రాధే శ్యామ్’ టీజర్, ‘సలార్’ గ్లింప్స్, ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్, ‘ప్రాజెక్ట్-K’ కాన్సెప్ట్/ టైటిల్ పోస్టర్, ‘స్పిరిట్’ పోస్టర్‌తో పాటు కొత్త సినిమా ప్రకటన కూడా రాబోతుందని అంటున్నారు.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..

రెండు రోజులు, ఆరు సినిమాల అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కి అదిరిపోయే బర్త్‌డే ట్రీట్ ఇస్తున్నారు డార్లింగ్. ఆ రెండు రోజులు సోషల్ మీడియా ఏ రేంజ్‌లో షేక్ అవుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా..

SPIRIT : పవర్‌ఫుల్ పోలీస్‌గా ప్రభాస్..

ట్రెండింగ్ వార్తలు