Russell – Avika Gor : వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌తో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన అవికాగోర్..
బాలనటిగా బుల్లితెరపై అడుగుపెట్టిన అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురుగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది.
- Thota Vamshi Kumar
- Published On : May 10, 2024 / 02:44 PM IST
Andre Russell belts out Ladki Tu Kamaal Ki song with Avika Gor
బాలనటిగా బుల్లితెరపై అడుగుపెట్టిన అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురుగా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‌గా మారిపోయింది. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఒరిజినల్స్‌తో పాటు పలు ఆల్భమ్‌లలో కూడా నటిస్తోంది. తాజాగా అమ్మడు వెస్టిండీస్ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌తో కలిసి చిందులేసింది.
ఓ వైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు ఆల్భమ్‌లలో నటిస్తున్నాడు ఆండ్రీ రస్సెల్. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవికాగోర్‌తో కలిసి ఓ ఆల్భమ్ చేశాడు. ‘లడ్కీ తు కమాల్ కీ’ అంటూ సాగే హిందీ ఆల్బమ్‌లో అవికా గోర్‌తో కలిసి రస్సెల్ హుషారైన స్టెప్పులు వేసి అలరించాడు. అంతేకాదండోమ్ పాటని కూడా రస్సెల్ పాడడం విశేషం.
Devara : ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..
రంగు కళ్లద్దాలు, నల్ల బనీన్, దానిపై గజిబిజి అక్షరాలతో ఫుల్ హ్యాండ్ షర్ట్, లుంగీని ధరించి రస్సెల్ చాలా స్ట్రైలిష్ గా కనిపిస్తుండా.. మరోవైపు అవికా గోర్ నీలిరంగు చీరలో పడుచు పరవాలను ఒలికిస్తూ కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ సారి ఈ పాటను చూసేయండి.
