Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం దేవ‌ర‌.

Devara : ఎన్టీఆర్ ‘దేవ‌ర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌..

NTR Devara first Single update

Devara first Single update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ చిత్రం దేవ‌ర‌. బాలీవుడ్‌ న‌టి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా క‌నిపించ‌నున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రెండు భాగాలుగా విడుద‌ల కానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

2024 అక్టోబ‌ర్ 10న మొద‌టి భాగం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. తాజాగా ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర బృందం చెప్పింది. ఈ చిత్రం మొద‌టి సాంగ్‌ను అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు పుల్ ఖుషి అవుతున్నారు. అనిరుధ్ రవిచందర్ ఎలాంటి మ్యూజిక్‌ను ఇచ్చాడోన‌ని ఆత్రుత‌గా వెయిట్ చేస్తున్నారు.

Mega Star Chiranjeevi : ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారానికి ముందు.. ఉపాసన ప్రశ్నలు చిరు సమాధానాలు..

కాగా.. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పాట‌ను విడుద‌ల చేస్తారా? లేదంటే ముందుగానే పాట‌ను విడుద‌ల చేసి ఆ రోజును మ‌రేదైనా స‌ర్‌ప్రైజ్ ఇస్తారా ? అన్న‌ది తెలియాలంటే మ‌రో ప‌ది రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.