Aravind Krishna S I T Movie OTT Streaming Full Details Here
SIT : అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘SIT'(సిట్ – స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్). SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కింది.
Also Read : Jacqueliene Fernandez : బాలీవుడ్ భామతో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు..
సిట్ సినిమాలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నాడు. నటాషా దోషి హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సిట్ సినిమా ట్రైలర్ ని మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేసి అభినందించారు.
ఓ అమ్మాయి రేప్, మర్డర్ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అని సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సిట్ సినిమా జీ5 ఓటీటీలో నేడు మే 10 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది .