Jacqueliene Fernandez : బాలీవుడ్ భామతో లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్లాన్ చేస్తున్న టాలీవుడ్ దర్శకుడు..
త్వరలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ఓ టాలీవుడ్ దర్శకుడితో లేడి ఓరియెంటెడ్ సినిమా తీయబోతుందని వార్తలు వస్తున్నాయి.

Tollywood Director Jaya Shankar Planning a Lady Oriented Movie with Jacqueliene Fernandez
Jacqueliene Fernandez : బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ తో పాపులర్ అయిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడు వరుస సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంది. త్వరలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ఓ టాలీవుడ్ దర్శకుడితో లేడి ఓరియెంటెడ్ సినిమా తీయబోతుందని వార్తలు వస్తున్నాయి. గతంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగులో ప్రభాస్ సాహో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.
పేపర్ బాయ్ సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు జయ శంకర్ ఇటీవల అరి అంటూ అరిషడ్వర్గాల మీద సినిమా తీసాడు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ జయశంకర్ అరి తర్వాత తన నెక్స్ట్ సినిమా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో తీయబోతున్నట్టు తెలుస్తుంది. ఓ లేడి ఓరియెంటెడ్ కథని జయ శంకర్ ఇటీవల నయనతారకు వినిపించినట్లు తెలిసింది. తాజాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి వినిపించినట్టు, ఆమె ఓకే చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా పై అధికారిక ప్రకటన అనొచ్చు అని సమాచారం.
Also Read : Chiranjeevi : ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ
ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేతిశున్నారు. ఈ లిస్ట్ లో ఇప్పుడు జయ శంకర్ కూడా చేరారు. ఇక అరి సినిమా ఎన్నికలు అయ్యాక జూన్ లో రిలీజ్ కానుందని సమాచారం.