Prabhas : ప్రభాస్ ముందే చెప్పినా ఓం రౌత్ వినలేదా? ఆదిపురుష్ పై ప్రభాస్ కామెంట్స్.. వైరల్ అవుతున్న వీడియో..

సినిమా రిలీజయిన దగ్గర్నుంచి ఆదిపురుష్ సినిమా వివాదం నడుస్తూనే ఉంది. డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.

prabhas warning to director Om Raut at adipurush shoot time about movie

Om Raut :  ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్(Adipurush) దేశవ్యాప్తంగా విమర్శలు ఎదురుక్కుంటుంది. ముందు నుంచి రామాయణం(Ramayanam) అని చెప్పి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ప్రభాస్(Prabhas) రాముడిగా, కృతి సనన్(Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించారు. అసలు ఇది రామాయణం కాదని, రామాయణం పాత్రల స్వరూపం మార్చేశారని విమర్శలు రాగా చిత్రయూనిట్ మేము రామాయణం కాదు తీసింది అనే వ్యాఖ్యలు చేసి వివాదం మరింత పెద్దది చేసింది.

సినిమా రిలీజయిన దగ్గర్నుంచి ఆదిపురుష్ సినిమా వివాదం నడుస్తూనే ఉంది. డైరెక్టర్ ఓం రౌత్, రైటర్ మనోజ్ లపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేపాల్ లో ఈ సినిమాని బ్యాన్ చేశారు. ఇండియాలో కూడా సినిమాని బ్యాన్ చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ గతంలో రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.

ప్రభాస్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత నాకెందుకో అవుట్ పుట్ మీద డౌట్ వచ్చి నేను ఈ సినిమా చెయ్యొచ్చా? అంతకుముందు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఇతర సినిమాల విషయంలో తప్పు జరిగితే పర్వాలేదు. కానీ రామాయణం విషయంలో తప్పు జరగకూడదు. ఆదిపురుష్ విషయంలో మనం తప్పుచేయకూడదు అని ఓంరౌత్ ని అడిగాను. అతను.. మీరు అలాంటి భయాలేమి పెట్టుకోకండి, సినిమా బాగా వస్తుంది, నేనున్నాను అని చెప్పాడు అంటూ తెలిపాడు.

Adipurush Controversy : ఇది మ‌న రామాయ‌ణం కాదు.. వెంట‌నే బ్యాన్ చేయండి.. ప్ర‌ధాని మోదీకి లేఖ‌

దీంతో డైరెక్టర్ ఓం రౌత్ పై మరిన్ని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఓం రౌత్ పై ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ ముందే చెప్పినా నేనున్నాను అంటూ సినిమా అంతా తనకు ఇష్టం వచ్చినట్టు తీశాడని కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

ట్రెండింగ్ వార్తలు