Revanth Reddy – Chiranjeevi : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి.. గద్దర్ అవార్డ్స్ గురించి ఏమన్నారంటే..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేసారు.

Megastar Chiranjeevi Reacts on CM Revanth Reddy Comments about Gaddar Awards

Revanth Reddy – Chiranjeevi : సినీ పరిశ్రమలో ప్రభుత్వం తరపున నంది అవార్డులు గతంలో ఎన్నో ఏళ్లుగా ఇచ్చారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు గతంలో నంది అవార్డులు ఇవ్వాలని పలుమార్లు కామెంట్స్ చేసారు, ప్రభుత్వాలతో కూడా మాట్లాడారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతిష్టాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరిట ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కార్యక్రమాన్ని ఎలా చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు సినీ పరిశ్రమను ముఖ్య‌మంత్రి కోరారు.

అయితే దీనిపై టాలీవుడ్ స్పందించలేదని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. నేడు డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్ర‌ధానోత్స‌వ‌ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించిన‌ట్లుగా చెప్పారు. గద్దర్ అవార్డులపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండ‌డం ప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమ‌న్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి.

Also Read : Akira Nandan – Renu Desai : అమ్మతో కలిసి అడవిలో ట్రెక్కింగ్‌కి వెళ్ళిన అకిరా, ఆద్య.. వైరల్ అవుతున్న అకిరా ఫొటో..

దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేసారు. గతంలో గద్దర్ అవార్డ్స్ కి తను సపోర్ట్ గా మాట్లాడిన వీడియోని చిరంజీవి షేర్ చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపారు. దీంతో చిరంజీవి ట్వీట్ వైరల్ గా మారింది. మరి సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఇంకెవరైనా సినీ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు