Akira Nandan – Renu Desai : అమ్మతో కలిసి అడవిలో ట్రెక్కింగ్‌కి వెళ్ళిన అకిరా, ఆద్య.. వైరల్ అవుతున్న అకిరా ఫొటో..

తాజాగా మరో సారి పవన్ తనయుడు అకిరా నందన్ ఫొటో వైరల్ అవుతుంది.

Akira Nandan – Renu Desai : అమ్మతో కలిసి అడవిలో ట్రెక్కింగ్‌కి వెళ్ళిన అకిరా, ఆద్య.. వైరల్ అవుతున్న అకిరా ఫొటో..

Pawan Kalyan Son Akira Nandan Renu Desai Aadya went to Forest for Enjoyment

Updated On : July 30, 2024 / 6:42 PM IST

Akira Nandan – Renu Desai : పవన్ తనయుడు అకిరా నందన్ ఇటీవల బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత అకిరా నాన్న పక్కనే ఉండి తిరిగాడు, పలువురు ప్రముఖులను కలిసాడు, నాన్నతో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు, ప్రమాణ స్వీకారానికి కూడా వెళ్ళాడు. దీంతో అకిరా ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చి బాగా వైరల్ అయ్యాయి.

Also Read : Tammareddy Bharadwaja : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. సీఎం అపాయింట్మెంట్ ట్రై చేసాం కానీ..

తాజాగా మరో సారి అకిరా నందన్ ఫొటో వైరల్ అవుతుంది. ఇటీవల ఆదివారం నాడు అకిరా నందన్, ఆద్య, రేణు దేశాయ్.. మరి కొంతమంది కలిసి అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్లారు. అడవిలో ఎంజాయ్ చేసిన ఓ వీడియోని రేణు దేశాయ్ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఆదివారం పూత ఊరికే ఖాళీగా కుర్చోకుండా నేను, నా ఫ్రెండ్స్, ఆద్య ఫ్రెండ్స్ కలిసి అడివికి వెళ్ళాము. అడవిలో నాలుగు గంటలు నడిచాము. సోషల్ మీడియాకు దూరంగా ఒక్క రోజైనా ఇలా ఉండి ప్రకృతికి దగ్గరవ్వడం చాలా మంచిది అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియోలో వైరల్ గా మారింది. రేణు దేశాయ్, అకిరా, ఆద్య ఫారెస్ట్ లో సరదాగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న వీడియో మీరు కూడా చూసేయండి..

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

ఇక ఈ వీడియోలో అకిరా కొండా మీదకి ఎక్కి అలసిపోయి కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Image