Average Student Nani Song : ఇద్దరు హీరోయిన్స్ స్పెషల్ సాంగ్.. యావరేజ్ స్టూడెంట్ నాని సినిమా పాట విన్నారా?

ఇప్పటికే ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి రెండు మెలోడీ సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు.

Average Student Nani Movie Special Song Released

Average Student Nani Song : డైరెక్టర్ పవన్ కుమార్ ఇప్పుడు హీరోగా మారి ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాక తనే ఈ సినిమాకి నిర్మిస్తూ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాహిబా భాసిన్‌, స్నేహ మాల్వియ, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది.

Also Read : Shah Rukh Khan : కంటి చికిత్స కోసం అమెరికాకు షారుఖ్ పయనం.. ఆందోళనలో ఫ్యాన్స్..

ఇప్పటికే ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ సినిమా నుంచి రెండు మెలోడీ సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇద్దరు హీరోయిన్స్ తో హీరో స్పెషల్ సాంగ్ గా దీన్ని తెరకెక్కించారు. ‘రాలే పువ్వే మళ్ళీ పూస్తానన్నదే..’ అంటూ మాస్ మసాలా సాంగ్ లా సాగింది ఈ పాట. భువనేశ్వర్ రాగిఫణి ఈ పాటని రాయగా కార్తీక్ బి కొడకండ్ల సంగీత దర్శకంలో లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల ఈ పాటని పాడారు. రాజ్ పైడి మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేసారు. మీరు కూడా ఈ స్పెషల్ సాంగ్ వినేయండి..

 

ట్రెండింగ్ వార్తలు