Shah Rukh Khan : కంటి చికిత్స కోసం అమెరికాకు షారుఖ్ పయనం.. ఆందోళనలో ఫ్యాన్స్..
ఇటీవల షారుఖ్ ఖాన్ కంటికి చెందిన సమస్యతో బాధపడుతున్నాడట.

Shah Rukh Khan going to America for Eye Treatment
Shah Rukh Khan : గత కొన్నేళ్లు ఫ్లాప్స్ చూసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంవత్సరం గ్యాప్ లో జవాన్, పఠాన్, డంకి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు హిట్స్ కొట్టాడు. దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అంతా ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం షారుఖ్ నుంచి నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇంకా ఏమి రాలేదు. అయితే తాజాగా అభిమానులు ఆందోళన పడే ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇటీవల షారుఖ్ ఖాన్ కంటికి చెందిన సమస్యతో బాధపడుతున్నాడట. ఆల్రెడీ ముంబైలోని ఓ హాస్పిటల్ లో చూపించగా కంటికి శాస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపినట్టు సమాచారం. దీంతో షారుఖ్ ఖాన్ మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు పయనమవుతున్నట్టు బాలీవుడ్ సమాచారం. షారుఖ్ ఖాన్ నేడు అమెరికాకు వెళ్లనున్నట్టు, అమెరికాలోని ఓ హాస్పిటల్ లో కంటికి శస్త్ర చికిత్స చేయించుకుంటారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీంతో ఈ విషయం తెలిసి బాద్షా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. షారుఖ్ ఖాన్ త్వరగా కోలుకొని రావాలని, తన కొత్త సినిమా ప్రకటించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.