WOLF Teaser : ప్రభుదేవా ‘వూల్ఫ్’ టీజర్ చూశారా.. కొత్త కాన్సెప్ట్.. కొత్త ప్రపంచం..

ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'వూల్ఫ్' టీజర్ రిలీజ్ అయ్యింది.

Prabhu Dheva Vinoo Venketesh Anasuya B Raai Laxmi WOLF Teaser release

WOLF Teaser : ప్రభుదేవా, రాయ్ లక్ష్మీ, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో సందేశ్ నాగరాజు, సందేశ్ ఎన్ నిర్మాతలుగా, బృందా జయరామ్ సహ నిర్మాతగా వూల్ఫ్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి వినూ వెంకటేష్ దర్శకత్వం వహించారు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమా వూల్ఫ్ రాబోతోంది. తమిళ, తెలుగు, కన్నడ , హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్లు.

Pawan Kalyan : ఉస్తాద్, OG షూటింగ్ అప్డేట్స్.. వారాహి యాత్ర తరువాత ఆగష్టులో..

వూల్ఫ్ టీజర్‌ను గమనిస్తుంటే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. అనసూయ, ప్రభుదేవాలు సరికొత్త లుక్కులో కనిపించారు. 69 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. ఇక ప్రభుదేవా యాక్షన్ సీక్వెన్స్‌లు, అనసూయ గెటప్ ఈ సినిమా మీద మరింతగా ఆసక్తిని పెంచేస్తున్నాయి.

Baby Movie : భీమవరంలో బేబీ చిత్ర యూనిట్ అత్యుత్సాహం.. మీడియా పై బౌన్సర్లతో దాడి..

వశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేష్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు నటించిన ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, అమ్రిష్ సంగీత దర్శకుడిగా, లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు