MAA Elections: నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు సరదా ముచ్చట్లు..!

కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ ఇద్దరూ.. సరదాగా ముచ్చటించుకున్నారు.

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల కౌంటింగ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ కొనసాగుతోంది. ముందుగా.. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయింది. తర్వాత.. ఈసీ కమిటీ మెంబర్ల ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఈ కౌంటింగ్ లో.. ఎవరు లీడ్ లో ఉన్నారన్న విషయంపై రకరకాలుగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

ఇదే సమయంలో.. ఓ ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్.. ఇద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ ఇద్దరూ.. సరదాగా ముచ్చటించుకున్నారు.

నిన్నటివరకూ.. పరస్పరం విమర్శలు, తిట్లతో డైలాగ్ వార్ నడిపించిన ఈ ఇద్దరూ.. కౌంటింగ్ సమయంలో మాత్రం ఇలా చేతులు కలిపి నవ్వుతూ మాట్లాడుకోవడం.. అందర్నీ ఆకర్షించింది.

Also Read:

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో.. తొలి ఫలితం.. గెలిచిందెవరంటే..!

Maa Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుడిపై మోహన్‌బాబు ఆగ్రహం

MAA Elections: మా.. ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్..?

Maa Elections 2021: చేతిని కొరికిన హేమ.. మనిషి కాటు ప్రమాదమే.. హాస్పిటల్‌కు శివబాలాజీ!

ట్రెండింగ్ వార్తలు