West Bengal : ప్రశాంత్ కిషోర్ ఇంటి అడ్రస్ మారింది..ఎందుకు ? ఏ పార్టీ కోసం ?

వెస్ట్ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటర్ గా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే..ఇలా చేసి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Prashant Kishor Voter : ప్రశాంత్ కిషోర్..పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ఆయన పొలిటికల్ వ్యూహకర్త. ఈయన్ను పార్టీ వ్యూహకర్తగా నియమించుకోవడానికి చాలా పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. ఎందుకంటే..ఆయన పలు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు. దీనికంతటికి కారణం..ఆయన పక్కాగా రచించే వ్యూహాలు, ప్రణాళికలే అంటారు. అయితే..ఆయన కొన్ని పార్టీలకు మాత్రమే వ్యూహాలు రచిస్తుంటారు. ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని వెల్లడించిన పీకే…అసలు ఆయన ప్లాన్ ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.

Read More : Health Mission : ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డుకు రక్షణ, వైద్య విద్యలో సంస్కరణలు – మోదీ

2024 కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే ఆయన లక్ష్యంగా, పావులు కదుపుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో..ఆయన ఇంటి అడ్రస్ మార్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. వెస్ట్ బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటర్ గా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే..ఇలా చేసి ఉండవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదివరకు బీహార్ లోని ససారం జిల్లాలోని తన స్వగ్రామంలో ఓటర్ గా నమోదు చేసుకున్నారు.

Read More : India COVID 19 : గుడ్ న్యూస్! తగ్గుతున్న కేసులు.. కరోనా నుంచి దేశం కోలుకుంటోంది

ఈ నెల 30వ తేదీన భవనీపూర్ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో…ఇక్కడ ఉండనీయకుండా బీజేపీ ప్రయత్నాలు చేయవచ్చని ముందుగానే భావించి..పథకం ప్రకారం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బీజేపీ విమర్శలు చేయడం ప్రారంభించింది. గత ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.

Read More : Almond Tea : బాదం టీతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా!..

కాంగ్రెస్ లో చేరుతారని తొలుత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎందుకంటే రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన భేటీ కావడమే కారణం. బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో పీకే పని చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ..కలిసి సగం లోక్ సభ స్థానాలు సాధిస్తే..ఆ పార్టీ…అధికారం నుంచి తప్పించవచ్చని..పీకు పలు పార్టీలకు చెబుతున్నట్లు టాక్. 2024 సార్వత్రిక ఎన్నికల్ల కాంగ్రెస్ మద్దతు లేకుండా..బీజేపీని గద్దె దించడం సాధ్యం కాదని పలు పార్టీల నేతలు భావిస్తున్నారు. మరి పీకే ఎలాంటి వ్యూహాలతో వెళుతారనేది రానున్న రోజుల్లో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు